Edidigi rammanave yemiseppinaam jese

ఎదిటికి రమ్మనవే యేమిచెప్పినాఁ జేసే
Language

(॥పల్లవి॥)
ఎదిటికి రమ్మనవే యేమిచెప్పినాఁ జేసే
సదరమా నేనంత సటలు వద్దనవే

(॥ఎది॥)
పిలువవచ్చేదానవు ప్రియములు నేరవా
అలిగినాతఁడే వచ్చి ఆడవలెనే
చెలియవు నీవు నేనుఁ జెప్పఁబోతే నొక్కటే
తలుపుమాటున నుండేతన కింత దగునా

(॥ఎది॥)
వొక్కటి సే సేదాన వొడఁ బరచనేరవా
తక్కించి నాతఁడే ఇందు దగ్గరుగాక
మొక్కనేలే యాఁడుఁబొందు మొదలఁ గలిగినదే
కుక్కి నీచే కుదుళ్లలో గుఱ్ఱాలఁ దోలించీనా

(॥ఎది॥)
వొడివట్టినదానవు వున్న సుద్ది నేరవా
బడినే శ్రీ వేంకటాద్రిపతి తాఁ బట్టె
పడతివై వొప్పగించి పట్టి తెరవేసితివి
యెడయక నన్నుఁ గూడె యిఁక మరఁగేఁటికే

(||pallavi||)
ĕdiḍigi rammanave yemisĕppinām̐ jese
sadaramā nenaṁta saḍalu vaddanave

(||ĕdi||)
piluvavachchedānavu priyamulu neravā
aliginādam̐ḍe vachchi āḍavalĕne
sĕliyavu nīvu nenum̐ jĕppam̐bode nŏkkaḍe
talubumāḍuna nuṁḍedana kiṁta dagunā

(||ĕdi||)
vŏkkaḍi se sedāna vŏḍam̐ barasaneravā
takkiṁchi nādam̐ḍe iṁdu daggarugāga
mŏkkanele yām̐ḍum̐bŏṁdu mŏdalam̐ galiginade
kukki nīse kuduḽlalo guṭrālam̐ doliṁchīnā

(||ĕdi||)
vŏḍivaṭṭinadānavu vunna suddi neravā
baḍine śhrī veṁkaḍādribadi tām̐ baṭṭĕ
paḍadivai vŏppagiṁchi paṭṭi tĕravesidivi
yĕḍayaga nannum̐ gūḍĕ yim̐ka maram̐gem̐ṭige