ఎదిటి పంతము లేల ఇంటిలోనికి రారాదా
(॥పల్లవి॥)
ఎదిటి పంతము లేల ఇంటిలోనికి రారాదా
కదియఁగ మెచ్చకుంటే గడుసవనేను
(॥ఎది॥)
నిన్ను నేను చెనకఁగ నేమపుమాట లాడేవు
యెన్నికబాస లెవ్వతె కిచ్చినాఁడవో
చన్నుల నొత్తి చూడఁగ సరుసఁ గరఁగకుంటే
వన్నెల రాయివంటివాఁడవనే నపుడు
(॥ఎది॥)
ఆయములు బుట్టితేను ఆచారాలు చెప్పేవు
యేయెడ నెంత చదివి యెరిఁగితివో
సోయగపుమో వియ్యఁగా చొక్కి లోను గాకుండితే
చాయల మాకువంటిజడుఁడ వనేను
(॥ఎది॥)
మలసి కాఁగిలించితే మంచిపొద్దు వెదకేవు
బలు శ్రీ వేంకటేశుఁడ పంతమెట్టిదో
వెలయ నేఁ గూడితి వేసా లిఁకఁ జెప్పు కుంటే
తొలఁగుచు మొరసేటి తుమ్మిద వనేను
(||pallavi||)
ĕdiḍi paṁtamu lela iṁṭilonigi rārādā
kadiyam̐ga mĕchchaguṁṭe gaḍusavanenu
(||ĕdi||)
ninnu nenu sĕnagam̐ga nemabumāḍa lāḍevu
yĕnnigabāsa lĕvvadĕ kichchinām̐ḍavo
sannula nŏtti sūḍam̐ga sarusam̐ garam̐gaguṁṭe
vannĕla rāyivaṁṭivām̐ḍavane nabuḍu
(||ĕdi||)
āyamulu buṭṭidenu āsārālu sĕppevu
yeyĕḍa nĕṁta sadivi yĕrim̐gidivo
soyagabumo viyyam̐gā sŏkki lonu gāguṁḍide
sāyala māguvaṁṭijaḍum̐ḍa vanenu
(||ĕdi||)
malasi kām̐giliṁchide maṁchibŏddu vĕdagevu
balu śhrī veṁkaḍeśhum̐ḍa paṁtamĕṭṭido
vĕlaya nem̐ gūḍidi vesā lim̐kam̐ jĕppu kuṁṭe
tŏlam̐gusu mŏraseḍi tummida vanenu