ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ
(॥పల్లవి॥)
ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ
పాదగు మనలో నంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను
(॥ఏది॥)
మనవంటి జీవులే మహిలోన నొక కొన్ని
శునకములై కుక్కుటములై సూకరములు నైనవి
దినదినముఁ గర్మపాశములఁ దిరిగెడి దుర్దశ లటుచూడు
సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటుచూడు
(॥ఏది॥)
కన్నులుఁ గాళ్ళు మనవలెఁ దనువులు గైకొని కొందరు నరులు
పన్నిన తొత్తులు బంట్లునై మనపనులు సేయుచునున్నారు
యెన్నఁగ శ్రీహరి నెఱఁగక యిడుములఁ బొరలెడి దది చూడు
మున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు
(॥ఏది॥)
యింతగాలమును యీపుట్టుగులనె యిటువలెఁ బొరలితి మిన్నాళ్ళు
యింతట శ్రీవేంకటేశుఁడు దలంచి యీ జన్మంబున మము నేలె
వింతల బొరలిన నరకకూపముల వెనకటి దైన్యములటు చూడు
సంతసమున ముందరిమోక్షము సర్వానందంబది చూడు
(||pallavi||)
edi valasĕ nīvadi seyu yiṁdulona no jīvātma
pādagu manalo naṁtarātmayai paragina śhrīhari panubunanu
(||edi||)
manavaṁṭi jīvule mahilona nŏga kŏnni
śhunagamulai kukkuḍamulai sūgaramulu nainavi
dinadinamum̐ garmabāśhamulam̐ dirigĕḍi durdaśha laḍusūḍu
sanagādulai kŏṁdaru jīvulu śhauridāsulai raḍusūḍu
(||edi||)
kannulum̐ gāḽḽu manavalĕm̐ danuvulu gaigŏni kŏṁdaru narulu
pannina tŏttulu baṁṭlunai manabanulu seyusununnāru
yĕnnam̐ga śhrīhari nĕṟam̐gaga yiḍumulam̐ bŏralĕḍi dadi sūḍu
munnĕ haridāsulai nāradamukhyulu gĕlisina dadi sūḍu
(||edi||)
yiṁtagālamunu yībuṭṭugulanĕ yiḍuvalĕm̐ bŏralidi minnāḽḽu
yiṁtaḍa śhrīveṁkaḍeśhum̐ḍu dalaṁchi yī janmaṁbuna mamu nelĕ
viṁtala bŏralina naragagūbamula vĕnagaḍi dainyamulaḍu sūḍu
saṁtasamuna muṁdarimokṣhamu sarvānaṁdaṁbadi sūḍu