ఏది వాటి నీగుణాన కేమి చెప్పేము
(॥పల్లవి॥)
ఏది వాటి నీగుణాన కేమి చెప్పేము
పోదిగొన్న వద్దివారి పుణ్యము నీచేతిది
(॥ఏది॥)
సలిగెలు రేఁచుకొని సణఁగులురాలిచేటి-
చెలులకే నీవు కడుఁజిక్కుదువు
వలచి పైకొనియేటి వనితలఁ గంటేను
పెలుచుఁదనాన నట్టె బిగుతువు
(॥ఏది॥)
చనవులు సేసుకొని సారె సారె దిట్టేటి-
వనితలకే నీవు వలతువు
పెనఁగి ప్రియముచెప్పేప్రియురాండ్లఁ గంటేను
కొనగొనలనే నీవు గుట్టుసేసుకొందువు
(॥ఏది॥)
తరితీపుసేసుకొని తమకాలు రేఁచేటి-
తరుణులనే నీవు దగ్గరుదువు
అరుదై శ్రీవేంకటేశ అంతలో నన్నుఁ గూడితిః
విరవై అంతటిలోనే యిందరి మన్నింతువు
(||pallavi||)
edi vāḍi nīguṇāna kemi sĕppemu
podigŏnna vaddivāri puṇyamu nīsedidi
(||edi||)
saligĕlu rem̐sugŏni saṇam̐gulurāliseḍi-
sĕlulage nīvu kaḍum̐jikkuduvu
valasi paigŏniyeḍi vanidalam̐ gaṁṭenu
pĕlusum̐danāna naṭṭĕ biguduvu
(||edi||)
sanavulu sesugŏni sārĕ sārĕ diṭṭeḍi-
vanidalage nīvu valaduvu
pĕnam̐gi priyamusĕppepriyurāṁḍlam̐ gaṁṭenu
kŏnagŏnalane nīvu guṭṭusesugŏṁduvu
(||edi||)
taridībusesugŏni tamagālu rem̐seḍi-
taruṇulane nīvu daggaruduvu
arudai śhrīveṁkaḍeśha aṁtalo nannum̐ gūḍidiḥ
viravai aṁtaḍilone yiṁdari manniṁtuvu