ఏది వాటి నీ మాటల కెదురాడేమా
(॥పల్లవి॥)
ఏది వాటి నీ మాటల కెదురాడేమా
సాదవౌదు విన్నిటాను సతిఁగూడరాదా
(॥ఏది॥)
మొలకచన్నుల చెలి మొనలు నాటించితేను
బలు గబ్బి యిదియంటాఁ బంతమాఁడేవు
సెలవి నవ్వుల దిది సిగ్గులు పైఁ బూసితేను
అలరుచు గేలి సేసెనని యాడేవు
(॥ఏది॥)
చెందమ్మిగోళ్ల చెలి చెక్కు లిట్టె నొక్కితేను
కందువ లంటించెనంటా గద్దించేవు
మందయాన యిది నిన్ను మలసి కాలుదొక్కితే
మందె మేళమనుచును మత్సరించేవు
(॥ఏది॥)
ఆయ మెరిఁగిన చెలి యట్టె కాఁగిలించుకొంటే
చేయి ముంచెనంటా నీవే చిమ్మి రేఁగేవు
యీయెడ శ్రీ వేంకటేశ ఇట్టె యాపెఁగూడితివి
మాయలాడి యిదియంటా మన్నించేవు
(||pallavi||)
edi vāḍi nī māḍala kĕdurāḍemā
sādavaudu vinniḍānu sadim̐gūḍarādā
(||edi||)
mŏlagasannula sĕli mŏnalu nāḍiṁchidenu
balu gabbi yidiyaṁṭām̐ baṁtamām̐ḍevu
sĕlavi navvula didi siggulu paim̐ būsidenu
alarusu geli sesĕnani yāḍevu
(||edi||)
sĕṁdammigoḽla sĕli sĕkku liṭṭĕ nŏkkidenu
kaṁduva laṁṭiṁchĕnaṁṭā gaddiṁchevu
maṁdayāna yidi ninnu malasi kāludŏkkide
maṁdĕ meḽamanusunu matsariṁchevu
(||edi||)
āya mĕrim̐gina sĕli yaṭṭĕ kām̐giliṁchugŏṁṭe
seyi muṁchĕnaṁṭā nīve simmi rem̐gevu
yīyĕḍa śhrī veṁkaḍeśha iṭṭĕ yābĕm̐gūḍidivi
māyalāḍi yidiyaṁṭā manniṁchevu