Edi nijamani vumdu merumgimchavayya maagu

ఏది నిజమని వుందు మెరుఁగించవయ్య మాకు
Language

(॥పల్లవి॥)
ఏది నిజమని వుందు మెరుఁగించవయ్య మాకు
మేదించి వలపు లిరుమేలాఁ బూసేవు

(॥॥)
విన్నపము నేఁజేయఁగ వీనులనే వింటివి
కన్నుల నాపెఁ జూచేవు కమ్మటి నీవు
చన్నులనేనొత్తితేను సరిఁ బులకించేవు
సన్న లాపెకు జేసేవు సారెసారె నిపుడు

(॥॥)
మాటలు నే నాఁడఁగాను మచ్చిక నూఁకొంటివి
గాఁటాన మోవి చూపేవు కడు నాపెకు
యీటున నే నవ్వితేను యిచ్చగించే విందుకు
పాటించి మన సాపెపై నిలిపేవు

(॥॥)
పిలిచితే వచ్చితి ప్రియాన మా యింటికి
యెలమి నాసపడేవు ఇంకా నాపెకు
కలసితి విటు శ్రీ వేంకటేశ్వర నన్నును
తొలుతటిపొందు లాపెతోఁ బొదిపేవు

(||pallavi||)
edi nijamani vuṁdu mĕrum̐giṁchavayya māgu
mediṁchi valabu lirumelām̐ būsevu

(||||)
vinnabamu nem̐jeyam̐ga vīnulane viṁṭivi
kannula nābĕm̐ jūsevu kammaḍi nīvu
sannulanenŏttidenu sarim̐ bulagiṁchevu
sanna lābĕgu jesevu sārĕsārĕ nibuḍu

(||||)
māḍalu ne nām̐ḍam̐gānu machchiga nūm̐kŏṁṭivi
gām̐ṭāna movi sūbevu kaḍu nābĕgu
yīḍuna ne navvidenu yichchagiṁche viṁdugu
pāḍiṁchi mana sābĕbai nilibevu

(||||)
piliside vachchidi priyāna mā yiṁṭigi
yĕlami nāsabaḍevu iṁkā nābĕgu
kalasidi viḍu śhrī veṁkaḍeśhvara nannunu
tŏludaḍibŏṁdu lābĕdom̐ bŏdibevu