ఏది నిజమని మీరు యెట్టు వొడఁబరచేరే
(॥పల్లవి॥)
ఏది నిజమని మీరు యెట్టు వొడఁబరచేరే
ఆదినుండి యీ కతలు అడుగరే యాతని
(॥ఏది॥)
కన్నుల తేటలువాగె కాయము చెమటగారె
యెన్నియైనా తనమాట లేడ కెక్కునే
నిన్ననే వచ్చేనని నేఁడు యీపొద్దుకు వచ్చె
అన్నిటాఁ గలదో లేదో అడుగరే మీరు
(॥ఏది॥)
మోమునఁ గళలు నిక్కె మోవిపైఁ గెంపులు చిక్కె
యేమిటికైనా తన్ను నెట్టు నమ్మేరే
దోమటి యాడఁ దొడికె దొరతన మిడఁ జేసె
ఆముక కలదో లేదో అడుగరే మీరు
(॥ఏది॥)
సెలవుల నవ్వు నించె చేతులనే కాఁగిలించె
యెలమి నెటుల నిఁక నెదురాడేనే
కలవాఁడు తానె శ్రీవేంకటపతి నన్నుఁ గూడె
అలుకలన్నియుఁ దేరె నడుగరే మీరు
(||pallavi||)
edi nijamani mīru yĕṭṭu vŏḍam̐barasere
ādinuṁḍi yī kadalu aḍugare yādani
(||edi||)
kannula teḍaluvāgĕ kāyamu sĕmaḍagārĕ
yĕnniyainā tanamāḍa leḍa kĕkkune
ninnane vachchenani nem̐ḍu yībŏddugu vachchĕ
anniḍām̐ galado ledo aḍugare mīru
(||edi||)
momunam̐ gaḽalu nikkĕ movibaim̐ gĕṁpulu sikkĕ
yemiḍigainā tannu nĕṭṭu nammere
domaḍi yāḍam̐ dŏḍigĕ dŏradana miḍam̐ jesĕ
āmuga kalado ledo aḍugare mīru
(||edi||)
sĕlavula navvu niṁchĕ sedulane kām̐giliṁchĕ
yĕlami nĕḍula nim̐ka nĕdurāḍene
kalavām̐ḍu tānĕ śhrīveṁkaḍabadi nannum̐ gūḍĕ
alugalanniyum̐ derĕ naḍugare mīru