Edi dishtaamtamu yimdulonanu

ఏది దిష్టాంతము యిందులోనను
Language

(॥పల్లవి॥)
ఏది దిష్టాంతము యిందులోనను
పోది సేసేవాఁడు నన్నుఁ బొందఁగవద్దా

(॥॥)
యీయెడ నింతేసి నాతో యెగ్గువట్టేవాఁడు తోల్లే
నాయెడకు నిజముగా నడవవద్దా
పాయక వున్నాఁడనంటా బాసలు సేసేవాఁడు
చాయలకు నాపై మేలు చల్లఁగవద్దా

(॥॥)
చిత్తగించి నాతో నింత సిగ్గువడేవాఁడు నాఁడే
కొత్తరేకలు సేయించుకోకుండవద్దా
బత్తిగల వాఁడనంటా పైకొనవచ్చేవాఁడు
పొత్తుల నామాటకు వుత్తరమీవద్దా

(॥॥)
గక్కన నన్నిట్లాను కాఁగిలించేవాఁ డప్పుడే
చెక్కులు నొక్కుచు సన్న సేయఁగవద్దా
యిక్కువలంటి శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గూడె
మక్కళించి నన్నిట్లా మన్నించవద్దా

(||pallavi||)
edi diṣhṭāṁtamu yiṁdulonanu
podi sesevām̐ḍu nannum̐ bŏṁdam̐gavaddā

(||||)
yīyĕḍa niṁtesi nādo yĕgguvaṭṭevām̐ḍu tolle
nāyĕḍagu nijamugā naḍavavaddā
pāyaga vunnām̐ḍanaṁṭā bāsalu sesevām̐ḍu
sāyalagu nābai melu sallam̐gavaddā

(||||)
sittagiṁchi nādo niṁta sigguvaḍevām̐ḍu nām̐ḍe
kŏttaregalu seyiṁchugoguṁḍavaddā
battigala vām̐ḍanaṁṭā paigŏnavachchevām̐ḍu
pŏttula nāmāḍagu vuttaramīvaddā

(||||)
gakkana nanniṭlānu kām̐giliṁchevām̐ ḍappuḍe
sĕkkulu nŏkkusu sanna seyam̐gavaddā
yikkuvalaṁṭi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐ gūḍĕ
makkaḽiṁchi nanniṭlā manniṁchavaddā