Edaya neesuttariga meppudu maagum galadu

ఎడయ నీచుట్టరిక మెప్పుడు మాకుఁ గలదు
Language

(॥పల్లవి॥)
ఎడయ నీచుట్టరిక మెప్పుడు మాకుఁ గలదు
తడవితే నానందము దైవారునే

(॥॥)
ననిచినచోటను నాఁటుకొను నేస్తము
తనిసినచోట నుండు తాలిములు
కనుఁగొనేచోట నిండు కడలేనియాసలు
పెనఁగఁబోతే వలపు పిప్పిగట్టునే

(॥॥)
తగులుగలుగుచోట తమకము లుప్పతిల్లు
సొగసినవావులైతే సొంపురేఁగును
మొగమోటగలచోట నగవులు తానే వచ్చు
యెగసక్కెమైతే మన సెరవులౌనే

(॥॥)
చెలఁగి కూడేటిచోట సిగ్గులు తానే విడు
వలెనని కాచితేనే వాడికలౌను
యెలమి శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె
బలిమి నేసితే రతి పచ్చిదేరునే

(||pallavi||)
ĕḍaya nīsuṭṭariga mĕppuḍu māgum̐ galadu
taḍavide nānaṁdamu daivārune

(||||)
nanisinasoḍanu nām̐ṭugŏnu nestamu
tanisinasoḍa nuṁḍu tālimulu
kanum̐gŏnesoḍa niṁḍu kaḍaleniyāsalu
pĕnam̐gam̐bode valabu pippigaṭṭune

(||||)
tagulugalugusoḍa tamagamu luppadillu
sŏgasinavāvulaide sŏṁpurem̐gunu
mŏgamoḍagalasoḍa nagavulu tāne vachchu
yĕgasakkĕmaide mana sĕravulaune

(||||)
sĕlam̐gi kūḍeḍisoḍa siggulu tāne viḍu
valĕnani kāsidene vāḍigalaunu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍĕ
balimi neside radi pachchiderune