Edaudaa neramgavu yeme neevu

ఏదౌతా నెరఁగవు యేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఏదౌతా నెరఁగవు యేమే నీవు
సాదించి మందెమేళాన సరసమాడేవు

(॥ఏదౌ॥)
సలిగెలు చెప్పివు చనవులు మెరసేవు
యెలమి నాతనికి నీ కెన్నటిపొందే
పిలిచేవు పేరుకొని బిగిసే వంతటిలోనే
వలచి నీ కతఁడు కైవస మాయనటవే

(॥ఏదౌ॥)
కుప్పలుగా నవ్వేవు గుబ్బలు దాఁకించేవు
అప్పుడే చేతిలోనివాఁ డాయనటవే
కుప్పేవు పయ్యదకొంగు కాఁగిలించ వచ్చేవు
చిప్పిలి నీరతులకు సెల విచ్చెనటనే

(॥ఏదౌ॥)
సన్నలెల్లాఁ జేసేవు సంగడిఁ గూచుండేవు
అన్నిటా నీవింతనికి నాలవటవే
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
మన్నించి న న్నేలినాఁడు మహిఁ గంటివటవే

(||pallavi||)
edaudā nĕram̐gavu yeme nīvu
sādiṁchi maṁdĕmeḽāna sarasamāḍevu

(||edau||)
saligĕlu sĕppivu sanavulu mĕrasevu
yĕlami nādanigi nī kĕnnaḍibŏṁde
pilisevu perugŏni bigise vaṁtaḍilone
valasi nī kadam̐ḍu kaivasa māyanaḍave

(||edau||)
kuppalugā navvevu gubbalu dām̐kiṁchevu
appuḍe sedilonivām̐ ḍāyanaḍave
kuppevu payyadagŏṁgu kām̐giliṁcha vachchevu
sippili nīradulagu sĕla vichchĕnaḍane

(||edau||)
sannalĕllām̐ jesevu saṁgaḍim̐ gūsuṁḍevu
anniḍā nīviṁtanigi nālavaḍave
yĕnnam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
manniṁchi na nnelinām̐ḍu mahim̐ gaṁṭivaḍave