ఎడసిన నొకసకి యెనసిన నొకసకి
(॥పల్లవి॥)
ఎడసిన నొకసకి యెనసిన నొకసకి
పడఁతికి నెటువంటిభాగ్యమో కాని
(॥ఎడ॥)
చింతాజలధిఁ బాసి చేరె నినుఁ జెలి యంటే
వంతచెమటజలధి వచ్చె నొకటి
చెంతల నీ విరహపు చీఁకటిఁ బాసె నంటే
కాంతకు తురుముచీఁకటి ముంచుకొనెను
(॥ఎడ॥)
కొండలంత కోరెకెలు గొచ్చి నినుఁ గూడెనంటే
అండనే చనుఁగొండ లడ్డమాయను
వెండివలె దేహమెల్లా వెల్లఁబారి మానెనంటే
వెండి కంటెఁ దెల్లనాయఁ వెలఁదికి కన్నులు
(॥ఎడ॥)
మురునమ్ముల కంతలు మాని నినుఁ బొందెనంటే
సిరుల పులకలచే చిల్లులాయను
సరుగ శ్రీవేంకటేశ సతిఁ గూడితిని నేఁడు
ఇరవై తొల్లిటివెల్లా నియ్యకోలే ఆయను
(||pallavi||)
ĕḍasina nŏgasagi yĕnasina nŏgasagi
paḍam̐tigi nĕḍuvaṁṭibhāgyamo kāni
(||ĕḍa||)
siṁtājaladhim̐ bāsi serĕ ninum̐ jĕli yaṁṭe
vaṁtasĕmaḍajaladhi vachchĕ nŏgaḍi
sĕṁtala nī virahabu sīm̐kaḍim̐ bāsĕ naṁṭe
kāṁtagu turumusīm̐kaḍi muṁchugŏnĕnu
(||ĕḍa||)
kŏṁḍalaṁta korĕgĕlu gŏchchi ninum̐ gūḍĕnaṁṭe
aṁḍane sanum̐gŏṁḍa laḍḍamāyanu
vĕṁḍivalĕ dehamĕllā vĕllam̐bāri mānĕnaṁṭe
vĕṁḍi kaṁṭĕm̐ dĕllanāyam̐ vĕlam̐digi kannulu
(||ĕḍa||)
murunammula kaṁtalu māni ninum̐ bŏṁdĕnaṁṭe
sirula pulagalase sillulāyanu
saruga śhrīveṁkaḍeśha sadim̐ gūḍidini nem̐ḍu
iravai tŏlliḍivĕllā niyyagole āyanu