Edaside nogaguna meduda nogagunamu

ఎడసితే నొకగుణ మెదుట నొకగుణము
Language

(॥పల్లవి॥)
ఎడసితే నొకగుణ మెదుట నొకగుణము
అడియాలాలెల్లఁ గంటి మౌలేరా మాఁటలు

(॥॥)
నిచ్చలు వద్దనుండేటినెలఁతలపొందుకంటే
వచ్చీరాని వనితల వలపు చవి
పెచ్చువెరిగే వౌలేరా పెళ్ళిచెట్టు మందుగాదు
యిచ్చకము సేయవచ్చే విఁకనేల మాటలు

(॥॥)
భావించి నాలుకమీఁదిపంచదారకంటెను
ఆవలిచేఁదే తరితీపై యుండును
కావించి యరచేతిమాణికమైనా సరకు గాదు
యీవేళఁ గొసరేదా యిఁకనేల మాటలు

(॥॥)
కాఁగిటఁ గూడినయట్టికమ్మనిరతులకంటె
మూఁగినభావరతుల మోహము బెట్టు
యేఁగివచ్చి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మాఁగినపండు చవౌను మరియేల మాఁటలు

(||pallavi||)
ĕḍaside nŏgaguṇa mĕduḍa nŏgaguṇamu
aḍiyālālĕllam̐ gaṁṭi maulerā mām̐ṭalu

(||||)
nichchalu vaddanuṁḍeḍinĕlam̐talabŏṁdugaṁṭe
vachchīrāni vanidala valabu savi
pĕchchuvĕrige vaulerā pĕḽḽisĕṭṭu maṁdugādu
yichchagamu seyavachche vim̐kanela māḍalu

(||||)
bhāviṁchi nālugamīm̐dibaṁchadāragaṁṭĕnu
āvalisem̐de taridībai yuṁḍunu
kāviṁchi yarasedimāṇigamainā saragu gādu
yīveḽam̐ gŏsaredā yim̐kanela māḍalu

(||||)
kām̐giḍam̐ gūḍinayaṭṭigammaniradulagaṁṭĕ
mūm̐ginabhāvaradula mohamu bĕṭṭu
yem̐givachchi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
mām̐ginabaṁḍu savaunu mariyela mām̐ṭalu