ఎడసి కూడిన పొందు ఇంపులాయను
(॥పల్లవి॥)
ఎడసి కూడిన పొందు ఇంపులాయను
తడవి మీ భావములు తలపోసేమయ్యా
(॥॥)
చెక్కునఁ బెట్టినచెయ్యి సెలవిఁ బారేటినవ్వు
వొక్కమాటే చెలియకు నొనగూడెను
నిక్కపువోరమణుఁడ నీమహిమలే ఇవి
మిక్కిలి మాలో నేమే మెచ్చుకొనేమయ్యా
(॥॥)
మేర మీరు నిట్టూర్పులు మితిమీరు తమకము
యీరెండు నింతికి నిట్టె ఇరవాయను
ఆరయ వోరమణుడ అమరించితివి రీతి
యేరుపరచి మీసుద్దు లెంచుకొనేమయ్యా
(॥॥)
పయ్యదలెడజారును పచ్చిదేరేరతిచొక్కు
నెయ్యపుఁ గామిని కిట్టె నెలవాయను
యియ్యెడ శ్రీవేంకటేశ యెనసితి వింతలోనె
చయ్యన మిమ్ముఁ బొగడి సంతోసించేమయ్యా
(||pallavi||)
ĕḍasi kūḍina pŏṁdu iṁpulāyanu
taḍavi mī bhāvamulu talabosemayyā
(||||)
sĕkkunam̐ bĕṭṭinasĕyyi sĕlavim̐ bāreḍinavvu
vŏkkamāḍe sĕliyagu nŏnagūḍĕnu
nikkabuvoramaṇum̐ḍa nīmahimale ivi
mikkili mālo neme mĕchchugŏnemayyā
(||||)
mera mīru niṭṭūrbulu midimīru tamagamu
yīrĕṁḍu niṁtigi niṭṭĕ iravāyanu
āraya voramaṇuḍa amariṁchidivi rīdi
yerubarasi mīsuddu lĕṁchugŏnemayyā
(||||)
payyadalĕḍajārunu pachchidereradisŏkku
nĕyyabum̐ gāmini kiṭṭĕ nĕlavāyanu
yiyyĕḍa śhrīveṁkaḍeśha yĕnasidi viṁtalonĕ
sayyana mimmum̐ bŏgaḍi saṁtosiṁchemayyā