ఏడనుందురో తాము యెన్నికెపౌఁజులు దాఁటి
(॥పల్లవి॥)
ఏడనుందురో తాము యెన్నికెపౌఁజులు దాఁటి-
రాడకాడే పొడచూపే రాహా మేలు
(॥ఏడ॥)
యెలమి స్వప్నమనే యెడపుఁ జావడిలో
వొలసి జీవుఁడు కొలువున్నపుడు
వెలినున్న చైతన్యవిధుల దొరలచేతి-
యలబలము గాన మాహా మేలు
(॥ఏడ॥)
ఉప్పడమయి దేహమనే వూరఁ బెద్దచావడి
ఉప్పతిల్లి దేహి కొలువున్నపుడు
చప్పుడుతో నింద్రియవిషయపరివారము
అప్పుడు పారాడుదురు ఆహా మేలు
(॥ఏడ॥)
అక్కడ నిద్దురలనే అంతఃపురాల కేఁగి
వుక్కున భోగాన నాత్మ వున్నపుడు
యెక్కువ శ్రీవేంకటేశ యెవ్వరూ నాడకుఁ బోరు
అక్కడా నీవే వుందు వాహా మేలు
(||pallavi||)
eḍanuṁduro tāmu yĕnnigĕbaum̐julu dām̐ṭi-
rāḍagāḍe pŏḍasūbe rāhā melu
(||eḍa||)
yĕlami svapnamane yĕḍabum̐ jāvaḍilo
vŏlasi jīvum̐ḍu kŏluvunnabuḍu
vĕlinunna saidanyavidhula dŏralasedi-
yalabalamu gāna māhā melu
(||eḍa||)
uppaḍamayi dehamane vūram̐ bĕddasāvaḍi
uppadilli dehi kŏluvunnabuḍu
sappuḍudo niṁdriyaviṣhayabarivāramu
appuḍu pārāḍuduru āhā melu
(||eḍa||)
akkaḍa nidduralane aṁtaḥpurāla kem̐gi
vukkuna bhogāna nātma vunnabuḍu
yĕkkuva śhrīveṁkaḍeśha yĕvvarū nāḍagum̐ boru
akkaḍā nīve vuṁdu vāhā melu