ఏడనుండి వచ్చెనో యీడకు నీకె
(॥పల్లవి॥)
ఏడనుండి వచ్చెనో యీడకు నీకె
నీడనుండి కదలదు నిర్మలాన నీకె
(॥॥)
మంతనాన నీవు నేను మాటలాడుకొనఁగాను
యింతలోఁ బొంచులువినీ నిదివో యీకె
వింతలుగ లోలోన వేడుకకు నవ్వఁగాను
పంతమున నప్పటిఁ దప్పకచూచీ నీకె
(॥॥)
జఱసి జఱసి మీరు సరసములాడఁగాను
గుఱుతులు వెట్టుకొనీ గుట్టున నీకె
మొఱఁగులు మఱఁగుల మోవు లందుకోఁగాను
అఱిముఱిఁ జెలులతో నాడుకొనీ నీకె
(॥॥)
శ్రీవేంకటేశ్వర చేరి నీవు గూడఁగాను
వోవలఁ దెరమాఁటున నున్నది యీకె
చేవదేర నీవు నన్ను చెంతల మన్నించఁగాను
వావిచెప్పి పెండ్లాడవచ్చీ నీకె
(||pallavi||)
eḍanuṁḍi vachchĕno yīḍagu nīgĕ
nīḍanuṁḍi kadaladu nirmalāna nīgĕ
(||||)
maṁtanāna nīvu nenu māḍalāḍugŏnam̐gānu
yiṁtalom̐ bŏṁchuluvinī nidivo yīgĕ
viṁtaluga lolona veḍugagu navvam̐gānu
paṁtamuna nappaḍim̐ dappagasūsī nīgĕ
(||||)
jaṟasi jaṟasi mīru sarasamulāḍam̐gānu
guṟudulu vĕṭṭugŏnī guṭṭuna nīgĕ
mŏṟam̐gulu maṟam̐gula movu laṁdugom̐gānu
aṟimuṟim̐ jĕlulado nāḍugŏnī nīgĕ
(||||)
śhrīveṁkaḍeśhvara seri nīvu gūḍam̐gānu
vovalam̐ dĕramām̐ṭuna nunnadi yīgĕ
sevadera nīvu nannu sĕṁtala manniṁcham̐gānu
vāvisĕppi pĕṁḍlāḍavachchī nīgĕ