ఏడనేడ నెవ్వతెచే యేమిచేఁత బడితివో
(॥పల్లవి॥)
ఏడనేడ నెవ్వతెచే యేమిచేఁత బడితివో
నీడలు యెండలు నాతో నీవు నడపకురా
(॥ఏడ॥)
అక్కరై మాటలాడేవు అసురుసురు ననేవు
యెక్కడ నున్నది చిత్త మిది యేమిరా
పక్కన నవ్వునవ్వేవు పరాకు సేసుకొనేవు
కక్కసపునీవలపు కానరాదురా
(॥ఏడ॥)
దగ్గరి విడెమిచ్చేవు తలయు వంచుకొనేవు
యెగ్గుసిగ్గు ననుమానా లెంతగద్దురా
వొగ్గి కళలు చూపేవు వూరకైన వాడేవు
దిగ్గన నీవిధమేదో తెలియఁగరాదురా
(॥ఏడ॥)
కాఁగిటనే కలసేవు కన్నులును మూసేవు
నీఁగని నీ పొందులకు నిజమేదిరా
పాఁగిన శ్రీవేంకటేశ భ్రమఇంచి కూడితివి
వీఁగవు రతుల నిఁక వివరించరాదురా
(||pallavi||)
eḍaneḍa nĕvvadĕse yemisem̐ta baḍidivo
nīḍalu yĕṁḍalu nādo nīvu naḍabagurā
(||eḍa||)
akkarai māḍalāḍevu asurusuru nanevu
yĕkkaḍa nunnadi sitta midi yemirā
pakkana navvunavvevu parāgu sesugŏnevu
kakkasabunīvalabu kānarādurā
(||eḍa||)
daggari viḍĕmichchevu talayu vaṁchugŏnevu
yĕggusiggu nanumānā lĕṁtagaddurā
vŏggi kaḽalu sūbevu vūragaina vāḍevu
diggana nīvidhamedo tĕliyam̐garādurā
(||eḍa||)
kām̐giḍane kalasevu kannulunu mūsevu
nīm̐gani nī pŏṁdulagu nijamedirā
pām̐gina śhrīveṁkaḍeśha bhrama̮iṁchi kūḍidivi
vīm̐gavu radula nim̐ka vivariṁcharādurā