Edamaamta limkanela yechcharimpu lavela

ఎడమాఁట లిఁకనేల యెచ్చరింపు లవేల
Language

(॥పల్లవి॥)
ఎడమాఁట లిఁకనేల యెచ్చరింపు లవేల
పడఁతులకుఁ బతుల కొడఁబాటులే కాక

(॥ఎడ॥)
వినయమే కలిగితే విరమంబు లెక్కడివి
మనసులే యెనసితే మరఁగేడది
చనవు సమకూడితే చలములకుఁ జోటేది
తనివోని మోహములు తావుకొనుఁగాక

(॥ఎడ॥)
మాటలే పొసఁగితే మచ్చరంబెందుండు
కూటమికి లోనైతే గొసరేడది
సూటిగా వలచితే సొలపులకు బనియేమి
గాఁటంపుఁదమకములు కమ్ముకొనుగాక

(॥ఎడ॥)
రతులు చేకూడితే రారాఁపు మరి
యితవు లిరవైతేను యెరవేడది
పతి నేలితివి నీవు సరుగ శ్రీవేంకటేశ
సతతంబు మీకుఁ గడుసంతసమే కాక

(||pallavi||)
ĕḍamām̐ṭa lim̐kanela yĕchchariṁpu lavela
paḍam̐tulagum̐ badula kŏḍam̐bāḍule kāga

(||ĕḍa||)
vinayame kaligide viramaṁbu lĕkkaḍivi
manasule yĕnaside maram̐geḍadi
sanavu samagūḍide salamulagum̐ joḍedi
tanivoni mohamulu tāvugŏnum̐gāga

(||ĕḍa||)
māḍale pŏsam̐gide machcharaṁbĕṁduṁḍu
kūḍamigi lonaide gŏsareḍadi
sūḍigā valaside sŏlabulagu baniyemi
gām̐ṭaṁpum̐damagamulu kammugŏnugāga

(||ĕḍa||)
radulu segūḍide rārām̐pu mari
yidavu liravaidenu yĕraveḍadi
padi nelidivi nīvu saruga śhrīveṁkaḍeśha
sadataṁbu mīgum̐ gaḍusaṁtasame kāga