(॥పల్లవి॥)
ఎడమాటలిఁకనేల యెందాఁకాను
విడువరాని బాసలు వెంట వచ్చీనయ్యా
(॥ఎడ॥)
పడఁతి పయ్యదలోని పాలిండ్లు నీకునిట్టె
విడిదల సేసెనిందు విచ్చాయవయ్యా
వుడివోని వలపుల వులుపా వట్టినదిదె
వెడఁగుఁదనాలేఁటికి విచ్చేయవయ్యా
(॥ఎడ॥)
కందువ తేనెల మోవి కలగంపుచూవులతో
విందులు నీకుఁ బెట్టీ విచ్చేయవయ్యా
కందువమాటలఁ జెప్పీ కడునుపచారాలు
విందువుగాని యీడకు విచ్చేయవయ్యా
(॥ఎడ॥)
కూడఁగఁ దనమేను చిగురుఁబానుపుగా నీకు
వేడుకఁ బరచెనిదె విచ్చేయవయ్యా
యీడనె శ్రీవేంకటేశ యింతిని గలసితివి
వీడెమిచ్చీనిట్లనే విచ్చేయవయ్యా
(||pallavi||)
ĕḍamāḍalim̐kanela yĕṁdām̐kānu
viḍuvarāni bāsalu vĕṁṭa vachchīnayyā
(||ĕḍa||)
paḍam̐ti payyadaloni pāliṁḍlu nīguniṭṭĕ
viḍidala sesĕniṁdu vichchāyavayyā
vuḍivoni valabula vulubā vaṭṭinadidĕ
vĕḍam̐gum̐danālem̐ṭigi vichcheyavayyā
(||ĕḍa||)
kaṁduva tenĕla movi kalagaṁpusūvulado
viṁdulu nīgum̐ bĕṭṭī vichcheyavayyā
kaṁduvamāḍalam̐ jĕppī kaḍunubasārālu
viṁduvugāni yīḍagu vichcheyavayyā
(||ĕḍa||)
kūḍam̐gam̐ danamenu sigurum̐bānubugā nīgu
veḍugam̐ barasĕnidĕ vichcheyavayyā
yīḍanĕ śhrīveṁkaḍeśha yiṁtini galasidivi
vīḍĕmichchīniṭlane vichcheyavayyā