ఎడమాటలే బెట్టు యేమి సేసీనే
(॥పల్లవి॥)
ఎడమాటలే బెట్టు యేమి సేసీనే
అడియాలములు చూపి యానవెట్టి రారే
(॥ఎడ॥)
ఇక్కువ మమ్ము నిలిపె యింతవొద్దాయ రాఁడు
యెక్కడఁ బనిగలిగె నేమి సేసీనే
మక్కువలు మఱచెనో మరుఁ డెచ్చరించెనో
అక్కడికే నే వత్తునో అడిగిరారే
(॥ఎడ॥)
అంటే ననఁగరాదు అల నేమముఁ బెట్టి
యింటిలో నున్నాఁడు యేమి సేసీనే
వింటలేదో నీమాట వేరొకతెఁ గూడున్నాఁడో
వొంటినున్న నాతపసు వొప్పగించి రారే
(॥ఎడ॥)
విందువలె విచ్చేసి వెనక నిలుచున్నాఁడు
ఇందులో నే నెఱఁగనా యేమిసేసీనే
ఆందపు శ్రీవేంకటేశుఁ డాయమంటి నన్నుఁ గూడె
ముందువెనకపనికి మొక్కితి నే ననరే
(||pallavi||)
ĕḍamāḍale bĕṭṭu yemi sesīne
aḍiyālamulu sūbi yānavĕṭṭi rāre
(||ĕḍa||)
ikkuva mammu nilibĕ yiṁtavŏddāya rām̐ḍu
yĕkkaḍam̐ banigaligĕ nemi sesīne
makkuvalu maṟasĕno marum̐ ḍĕchchariṁchĕno
akkaḍige ne vattuno aḍigirāre
(||ĕḍa||)
aṁṭe nanam̐garādu ala nemamum̐ bĕṭṭi
yiṁṭilo nunnām̐ḍu yemi sesīne
viṁṭaledo nīmāḍa verŏgadĕm̐ gūḍunnām̐ḍo
vŏṁṭinunna nādabasu vŏppagiṁchi rāre
(||ĕḍa||)
viṁduvalĕ vichchesi vĕnaga nilusunnām̐ḍu
iṁdulo ne nĕṟam̐ganā yemisesīne
āṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍāyamaṁṭi nannum̐ gūḍĕ
muṁduvĕnagabanigi mŏkkidi ne nanare