ఏడమాటలైనా నాడి యెలయించేవారము
(॥పల్లవి॥)
ఏడమాటలైనా నాడి యెలయించేవారము
జోడుగూడి నిన్నంతేసి చొక్కించఁ గలమా
(॥ఏడ॥)
మందెమేళమున మారు మలసేటివారము
సందడిఁ బెండ్లాడేటి సతులము
పందెపు సరసములఁ బదరేటి వారము
చెంది రతుల మెప్పించఁ జిత్తము వచ్చేమా
(॥ఏడ॥)
వుద్దండపుఁ జెనకుల వొరసేటి వారము
గద్దరి తనముల బింకపు వారము
పెద్దరికానకు మోవి పిప్పి సేసేవారము
వద్దనుండే యట్టి యితవరులఁ బోలేమా
(॥ఏడ॥)
ఇచ్చకపు సేవసేసి యింపు చల్లేవారము
కొచ్చి చనుఁగొండలను కుమ్మేవారము
మచ్చిక శ్రీ వేంకటేశ మమ్ము నిట్టె కూడితివి
తచ్చి తచ్చి నిన్నాసుద్ది తలపించ నోపేమా
(||pallavi||)
eḍamāḍalainā nāḍi yĕlayiṁchevāramu
joḍugūḍi ninnaṁtesi sŏkkiṁcham̐ galamā
(||eḍa||)
maṁdĕmeḽamuna māru malaseḍivāramu
saṁdaḍim̐ bĕṁḍlāḍeḍi sadulamu
paṁdĕbu sarasamulam̐ badareḍi vāramu
sĕṁdi radula mĕppiṁcham̐ jittamu vachchemā
(||eḍa||)
vuddaṁḍabum̐ jĕnagula vŏraseḍi vāramu
gaddari tanamula biṁkabu vāramu
pĕddarigānagu movi pippi sesevāramu
vaddanuṁḍe yaṭṭi yidavarulam̐ bolemā
(||eḍa||)
ichchagabu sevasesi yiṁpu sallevāramu
kŏchchi sanum̐gŏṁḍalanu kummevāramu
machchiga śhrī veṁkaḍeśha mammu niṭṭĕ kūḍidivi
tachchi tachchi ninnāsuddi talabiṁcha nobemā