Edamaadalaadagure yimtulaala

ఎడమాటలాడకురే యింతులాల
Language

(॥పల్లవి॥)
ఎడమాటలాడకురే యింతులాల
అడియాలములు గల వాతని నాసంది

(॥ఎడ॥)
మనసులొక్కటైతేను మారాడక వుండవలె
తనంతలేనికూటమి తమి రేఁచవలెనా
చనవు గల్గుచోట సాదించఁ బనిలేదు
పెనఁగఁబోతేఁ గడు బెండుపడు గుణము

(॥ఎడ॥)
వలపులే కలిగితే వాసి వంతు మానవలె
పొలసి మీరాతని బోదించవలెనా
అలుకలే తీరితేను ఆయము గరఁగవలె
బలిమి సేయఁగఁబోతే పచ్చిదోఁచు వయసు

(॥ఎడ॥)
చెల్లుబడైతేను సేసిన చేఁత దక్కవలె
మల్లాడఁబోతేను మట్టు మీరుఁ బనులు
ఇల్లిదివో శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
చిల్లరచేఁతలకెల్ల చెప్పరాదు ప్రియము

(||pallavi||)
ĕḍamāḍalāḍagure yiṁtulāla
aḍiyālamulu gala vādani nāsaṁdi

(||ĕḍa||)
manasulŏkkaḍaidenu mārāḍaga vuṁḍavalĕ
tanaṁtalenigūḍami tami rem̐savalĕnā
sanavu galgusoḍa sādiṁcham̐ baniledu
pĕnam̐gam̐bodem̐ gaḍu bĕṁḍubaḍu guṇamu

(||ĕḍa||)
valabule kaligide vāsi vaṁtu mānavalĕ
pŏlasi mīrādani bodiṁchavalĕnā
alugale tīridenu āyamu garam̐gavalĕ
balimi seyam̐gam̐bode pachchidom̐su vayasu

(||ĕḍa||)
sĕllubaḍaidenu sesina sem̐ta dakkavalĕ
mallāḍam̐bodenu maṭṭu mīrum̐ banulu
illidivo śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
sillarasem̐talagĕlla sĕpparādu priyamu