Edamaada limkanela yiddarunum goodidiri

ఎడమాట లిఁకనేల యిద్దరునుఁ గూడితిరి
Language

(॥పల్లవి॥)
ఎడమాట లిఁకనేల యిద్దరునుఁ గూడితిరి
అడరి జవ్వనపాయ మాఁపలేక వచ్చెను

(॥ఎడ॥)
చెమటలు గారఁగాను చిరునెరులు దూలఁగ
తమకాన నీవద్దికిఁ దానే వచ్చెను
మము నీవద్దికి నంపి మనసు నిలుపలేక
ప్రమదాన నిట్టే పెద్ద పరువున వచ్చెను

(॥ఎడ॥)
కొప్పు గడు వీడఁగాను కుచములు గదలఁగ
నప్పసము నీవద్దికి నాపె వచ్చెను
యిప్పుడే కమ్మలు వ్రాసి యిట్టె మాచేతికి నిచ్చి
చప్పుడుగాఁ దానే యీడ చదువఁగ వచ్చెను

(॥ఎడ॥)
నడపు దడఁబడఁగ నలిఁ బోఁకముడి వీడ
పడఁతి నీవెంటఁ బానుప పైకి వచ్చెను
యెడమిచ్చి శ్రీ వేంకటేశ యింతిఁ గూడితివి
జడియని రతుల నీసరి వచ్చెను

(||pallavi||)
ĕḍamāḍa lim̐kanela yiddarunum̐ gūḍidiri
aḍari javvanabāya mām̐palega vachchĕnu

(||ĕḍa||)
sĕmaḍalu gāram̐gānu sirunĕrulu dūlam̐ga
tamagāna nīvaddigim̐ dāne vachchĕnu
mamu nīvaddigi naṁpi manasu nilubalega
pramadāna niṭṭe pĕdda paruvuna vachchĕnu

(||ĕḍa||)
kŏppu gaḍu vīḍam̐gānu kusamulu gadalam̐ga
nappasamu nīvaddigi nābĕ vachchĕnu
yippuḍe kammalu vrāsi yiṭṭĕ māsedigi nichchi
sappuḍugām̐ dāne yīḍa saduvam̐ga vachchĕnu

(||ĕḍa||)
naḍabu daḍam̐baḍam̐ga nalim̐ bom̐kamuḍi vīḍa
paḍam̐ti nīvĕṁṭam̐ bānuba paigi vachchĕnu
yĕḍamichchi śhrī veṁkaḍeśha yiṁtim̐ gūḍidivi
jaḍiyani radula nīsari vachchĕnu