ఎడమాట లిఁక నేల యెదురుచూపు లేల
(॥పల్లవి॥)
ఎడమాట లిఁక నేల యెదురుచూపు లేల
తడవాయ నిన్నిటాను తా నెరుంగునే
(॥ఎడ॥)
మొగము చూచినఁ గాని ముచ్చటలు వాయవు
నగుతా నుండినఁ గాన ననుపు లేదు
తగులాయ మైనఁ గాని తమకము వొడమదు
వగ దీర నాతనివద్ద నుండవే
(॥ఎడ॥)
కందుల లంటినఁ గాని కరఁగవు మర్మములు
మందెమేళ మైనఁ గాని మాఁట లెక్కవు
చెంది చెనకినఁ గాని చిత్తము తనవి లేదు
విందువలె నిఁక వేరె విన్నప మేలే
(॥ఎడ॥)
చెక్కులు నొక్కినఁ గాని చేతులకసి దీరదు
వొక్కచో నుండినఁ గాని వొద్దికగాదు
యిక్కు పెరిగి శ్రీవెంకటేశుఁ డిట్టె నన్ను గూడె
చక్క నాయఁ బను లెల్ల జాణ తా నవునే
(||pallavi||)
ĕḍamāḍa lim̐ka nela yĕdurusūbu lela
taḍavāya ninniḍānu tā nĕruṁgune
(||ĕḍa||)
mŏgamu sūsinam̐ gāni muchchaḍalu vāyavu
nagudā nuṁḍinam̐ gāna nanubu ledu
tagulāya mainam̐ gāni tamagamu vŏḍamadu
vaga dīra nādanivadda nuṁḍave
(||ĕḍa||)
kaṁdula laṁṭinam̐ gāni karam̐gavu marmamulu
maṁdĕmeḽa mainam̐ gāni mām̐ṭa lĕkkavu
sĕṁdi sĕnaginam̐ gāni sittamu tanavi ledu
viṁduvalĕ nim̐ka verĕ vinnaba mele
(||ĕḍa||)
sĕkkulu nŏkkinam̐ gāni sedulagasi dīradu
vŏkkaso nuṁḍinam̐ gāni vŏddigagādu
yikku pĕrigi śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannu gūḍĕ
sakka nāyam̐ banu lĕlla jāṇa tā navune