Edamaada lemidigi nemdaamkaanu

ఎడమాట లేమిటికి నెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఎడమాట లేమిటికి నెందాఁకాను
బడివాయకుండరయ్య పడఁతియు నీవును

(॥॥)
తెలియ నింతికి నీకు దేహములు రెండైతే
తలఁ పొక్కటే కాదా తగులైనది
పిలిచితే మీకిఁ యిద్దరిపేరులు వేరులైతే
వల పొక్కటే కాదా వర్ణింపను

(॥॥)
చక్కఁదనా లిద్దరికి సరికిబేసికినైతే
చొక్కఁ జేసే పొందికలు జోడే కావా
ఇక్కువైనచూపులు యెదురుబడి నైతే
యెక్కువతమకములు యీటడైనవే కావా

(॥॥)
పేరడిమీసుద్దులు పెన్నుద్దులై వుండినాను
యీరసములేనిరతి యేకమే కాదా
యీరీతి శ్రీ వేంకటేశ యెనసితి రీపె నీవు
పోరచి మోవితీపులు పొత్తులవే కావా

(||pallavi||)
ĕḍamāḍa lemiḍigi nĕṁdām̐kānu
baḍivāyaguṁḍarayya paḍam̐tiyu nīvunu

(||||)
tĕliya niṁtigi nīgu dehamulu rĕṁḍaide
talam̐ pŏkkaḍe kādā tagulainadi
piliside mīgim̐ yiddariberulu verulaide
vala pŏkkaḍe kādā varṇiṁpanu

(||||)
sakkam̐danā liddarigi sarigibesiginaide
sŏkkam̐ jese pŏṁdigalu joḍe kāvā
ikkuvainasūbulu yĕdurubaḍi naide
yĕkkuvadamagamulu yīḍaḍainave kāvā

(||||)
peraḍimīsuddulu pĕnnuddulai vuṁḍinānu
yīrasamuleniradi yegame kādā
yīrīdi śhrī veṁkaḍeśha yĕnasidi rībĕ nīvu
porasi movidībulu pŏttulave kāvā