(॥పల్లవి॥)
ఎడమాట లాడించ నిఁక నేలా
పడఁతి నీ రమణుని భావము లోనాయను
(॥ఎడ॥)
చన్నులనే వొరసేది సంగడి నిలుచుండేది
కన్నులనే సొలసేది గలిగె నీకు
మన్ననలఁ గరఁగేది మలఁగుపై నొరగేది
అన్నిటా నీరమణుని కలవా ట్లాయను
(॥ఎడ॥)
సారె సారె నవ్వేది జంకెనల గొణఁగేది
ఆరీతి నాసలు సేసే దమరె నీకు
కోరికల మొరసేది గురుతులే అరసేది
యీరీతి నీపతి కిదేప నాయను
(॥ఎడ॥)
వట్టిమాఁట లాడేది వలపులే చల్లేది
చుట్టమవై పొందేది సూటాయ నీకు
యిట్టి శ్రీవేంకటేశుఁ డిటు నిన్నుఁ గలసెను
పట్టిపగ లాతనికి పరిణామ మాయను
(||pallavi||)
ĕḍamāḍa lāḍiṁcha nim̐ka nelā
paḍam̐ti nī ramaṇuni bhāvamu lonāyanu
(||ĕḍa||)
sannulane vŏrasedi saṁgaḍi nilusuṁḍedi
kannulane sŏlasedi galigĕ nīgu
mannanalam̐ garam̐gedi malam̐gubai nŏragedi
anniḍā nīramaṇuni kalavā ṭlāyanu
(||ĕḍa||)
sārĕ sārĕ navvedi jaṁkĕnala gŏṇam̐gedi
ārīdi nāsalu sese damarĕ nīgu
korigala mŏrasedi gurudule arasedi
yīrīdi nībadi kideba nāyanu
(||ĕḍa||)
vaṭṭimām̐ṭa lāḍedi valabule salledi
suṭṭamavai pŏṁdedi sūḍāya nīgu
yiṭṭi śhrīveṁkaḍeśhum̐ ḍiḍu ninnum̐ galasĕnu
paṭṭibaga lādanigi pariṇāma māyanu