ఎడమాట లాడవే మా ఇద్దరి సందు
(॥పల్లవి॥)
ఎడమాట లాడవే మా ఇద్దరి సందు
గడుసుఁదనము మాన్చఁ గలనా యీతనిని
(॥ఎడ॥)
తగవెరిఁగితేఁ జాలు తప్పులు నేఁ బట్టేనా
మొగమెత్తుమనవే నే ముంచి చూచేను
జగడాలడువడట చలము సాదించేనా
నగుమనవే వలపు నానఁబెటే(ట్టే) ను
(॥ఎడ॥)
నేమముతో నుండునట నెరుసు నే నెంచేనా
ఆమాఁట ఆడు మనవే అంది విడేలు
ఆముకో వలచునట అనుమానించేనా
దోమటికి రమ్మనవే తొడికే నే మొదలు
(॥ఎడ॥)
పెనఁగఁగా నేరిచితే సిరి తీసేనా ఇఁక
చన విమ్మనవే ఇట్టె సమ్మతించేను
యెనసె శ్రీ వేంకటేశుఁ డెదురెదురనే నన్ను
వినుమనవే మనవి విందు మోవిఁ బెట్టేను
(||pallavi||)
ĕḍamāḍa lāḍave mā iddari saṁdu
gaḍusum̐danamu māncham̐ galanā yīdanini
(||ĕḍa||)
tagavĕrim̐gidem̐ jālu tappulu nem̐ baṭṭenā
mŏgamĕttumanave ne muṁchi sūsenu
jagaḍālaḍuvaḍaḍa salamu sādiṁchenā
nagumanave valabu nānam̐bĕḍe(ṭṭe) nu
(||ĕḍa||)
nemamudo nuṁḍunaḍa nĕrusu ne nĕṁchenā
āmām̐ṭa āḍu manave aṁdi viḍelu
āmugo valasunaḍa anumāniṁchenā
domaḍigi rammanave tŏḍige ne mŏdalu
(||ĕḍa||)
pĕnam̐gam̐gā neriside siri tīsenā im̐ka
sana vimmanave iṭṭĕ sammadiṁchenu
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍĕdurĕdurane nannu
vinumanave manavi viṁdu movim̐ bĕṭṭenu