ఏడఁ గన్న నీకు మొక్కే దిందుకింతే పో
(॥పల్లవి॥)
ఏడఁ గన్న నీకు మొక్కే దిందుకింతే పో
ఆడుకోకు నీ పంతా లందునిందు నిఁకను
(॥ఏడ॥)
నడుమేల బడుగాయ నవ్వులేల తెలుపాయ
వెడఁగునీగుణములు వినివినిపో
జడిమాట లెందాఁకా జాలించు మిఁక గోడ
గడిగితే నసలేపో ఘనుఁడ ఇన్నిటాను
(॥ఏడ॥)
కురులేం చీఁకటాయ గోళ్లేల వాండ్లాయ
సొరిది నీచేఁతలు నే జూచిచూచి పో
వొరిమ నీయాసలు నొట్లు నాతో నేల
సరిఁ బిప్పి నమలితేఁ జప్పనే పో విభుఁడా
(॥ఏడ॥)
చెక్కులేల చెమరించెఁ జిత్తమేల ముదమందె
నెక్కొని శ్రీవేంకటేశ నిన్నుఁ గూడే పో
తక్కిన విన్నియు నేల తప్పులవే వొప్పులాయ
చిక్కినపులకెల్ల సేస లేపో ఇఁకను
(||pallavi||)
eḍam̐ ganna nīgu mŏkke diṁdugiṁte po
āḍugogu nī paṁtā laṁduniṁdu nim̐kanu
(||eḍa||)
naḍumela baḍugāya navvulela tĕlubāya
vĕḍam̐gunīguṇamulu vinivinibo
jaḍimāḍa lĕṁdām̐kā jāliṁchu mim̐ka goḍa
gaḍigide nasalebo ghanum̐ḍa inniḍānu
(||eḍa||)
kuruleṁ sīm̐kaḍāya goḽlela vāṁḍlāya
sŏridi nīsem̐talu ne jūsisūsi po
vŏrima nīyāsalu nŏṭlu nādo nela
sarim̐ bippi namalidem̐ jappane po vibhum̐ḍā
(||eḍa||)
sĕkkulela sĕmariṁchĕm̐ jittamela mudamaṁdĕ
nĕkkŏni śhrīveṁkaḍeśha ninnum̐ gūḍe po
takkina vinniyu nela tappulave vŏppulāya
sikkinabulagĕlla sesa lebo im̐kanu