ఏడలేని విన్నపాలు నిఁకనేలా
(॥పల్లవి॥)
ఏడలేని విన్నపాలు నిఁకనేలా
వాడుదేరి నీకు నాకు వలపులే గుఱుతు
(॥ఏడ॥)
పలుమాఁటలాడఁగాను పైపైఁ గోపమందురు
కలసి వూరకుండితే గర్వమందురు
మలసి విభుఁడ నీవు మన్నించి నదే గుఱుతు
చెలరేఁగి నేను సంతసించినదే గుఱుతు
(॥ఏడ॥)
మయిముట్టి చెనకఁగా మందె మేళ ములందురు
ప్రియమున లోఁగితేనే బీరమందురు
దయతోడ నీవు నన్ను దగ్గరినదే గుఱుతు
నయమున నే నీతో నవ్వినదే గుఱుతు
(॥ఏడ॥)
నెట్టిన నిన్ను రమ్మంటే నిండురాజసమందురు
గట్టిగా నే వచ్చితేను గబ్బినందురు
గుట్టున శ్రీ వేంకటేశ కూడితి నిదే గుఱుతు
మెట్టుకొని నే నిను మెచ్చినదే గుఱుతు
(||pallavi||)
eḍaleni vinnabālu nim̐kanelā
vāḍuderi nīgu nāgu valabule guṟudu
(||eḍa||)
palumām̐ṭalāḍam̐gānu paibaim̐ gobamaṁduru
kalasi vūraguṁḍide garvamaṁduru
malasi vibhum̐ḍa nīvu manniṁchi nade guṟudu
sĕlarem̐gi nenu saṁtasiṁchinade guṟudu
(||eḍa||)
mayimuṭṭi sĕnagam̐gā maṁdĕ meḽa mulaṁduru
priyamuna lom̐gidene bīramaṁduru
dayadoḍa nīvu nannu daggarinade guṟudu
nayamuna ne nīdo navvinade guṟudu
(||eḍa||)
nĕṭṭina ninnu rammaṁṭe niṁḍurājasamaṁduru
gaṭṭigā ne vachchidenu gabbinaṁduru
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidi nide guṟudu
mĕṭṭugŏni ne ninu mĕchchinade guṟudu