ఏడలేని సిగ్గుతోడ నేల లోఁగేవు
(॥పల్లవి॥)
ఏడలేని సిగ్గుతోడ నేల లోఁగేవు
యీడుజోడాయను మీకు నెప్పుడూఁ బాయకురే
(॥ఏడ॥)
ఇచ్చగించి వింటేను ఇంపులౌను మాటలు
కొచ్చికొచ్చి కొసరితే కూరిమి నిండు
విచ్చన వీళ్ళైతేను వేడుకలు సమకొను
మెచ్చుదాఁకాఁ బతితోను మేలములే యాడవే
(॥ఏడ॥)
నయమున నవ్వితేను నాఁటుకొను మోహము
ప్రియము చెప్పితే నంటు పెచ్చువెరుగు
ప్రియముట్టఁ జెనకితేఁ గెరలుఁదమకములు
నియతానఁ జొక్కుదాఁకా నేరుపులే చూపవే
(॥ఏడ॥)
మునుకొని పొదిగితే మొగమోట లుప్పతిలు
కనువిచ్చి చూడఁజూడ కరఁగుమతి
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నునేఁడు
తనివొందుదాఁకా నీతనితోఁ బెనగవే
(||pallavi||)
eḍaleni siggudoḍa nela lom̐gevu
yīḍujoḍāyanu mīgu nĕppuḍūm̐ bāyagure
(||eḍa||)
ichchagiṁchi viṁṭenu iṁpulaunu māḍalu
kŏchchigŏchchi kŏsaride kūrimi niṁḍu
vichchana vīḽḽaidenu veḍugalu samagŏnu
mĕchchudām̐kām̐ badidonu melamule yāḍave
(||eḍa||)
nayamuna navvidenu nām̐ṭugŏnu mohamu
priyamu sĕppide naṁṭu pĕchchuvĕrugu
priyamuṭṭam̐ jĕnagidem̐ gĕralum̐damagamulu
niyadānam̐ jŏkkudām̐kā nerubule sūbave
(||eḍa||)
munugŏni pŏdigide mŏgamoḍa luppadilu
kanuvichchi sūḍam̐jūḍa karam̐gumadi
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninnunem̐ḍu
tanivŏṁdudām̐kā nīdanidom̐ bĕnagave