Edaleni satyaalu nemdela seseene

ఏడలేని సత్యాలు నేఁడేల చేసీనే
Language

(॥పల్లవి॥)
ఏడలేని సత్యాలు నేఁడేల చేసీనే
వీడెమందినాఁడు యీ విద్యకుఁ దా ననరే

(॥॥)
మంతనానఁ దాను నేను మాటలాడుకొన్న వెల్లా
ఇంతటిలోననే ఆపె యెట్టెరిఁగెనే
అంతటివిభుఁడు తానె ఆనతియ్యఁ బోలుఁగాక
వంతులకు నాపె వచ్చి వద్ద నుండెనా

(॥॥)
గుట్టునఁ దాను నేను కూడుకొన్న సుద్దులెల్లా
గట్టిగా వెలినుండాపె కనెనటవే
చుట్టమువలెనే తాను చొప్పు చూపఁబోలుఁగాక
పొట్టపొరుగాపె వచ్చి పొందేయప్పు డుండెనా

(॥॥)
చేరి తెరలోఁ దనకు సేసిన సేవలెల్లా
తేరకే ఆపెమతిఁ దెలియుటెట్టే
మేరతో భూపతిచెరువు మేటి శ్రీవేంకటేశుఁడు
యీరీతి నన్నుఁ గూడఁగా నీడ నాలె వుండెనా

(||pallavi||)
eḍaleni satyālu nem̐ḍela sesīne
vīḍĕmaṁdinām̐ḍu yī vidyagum̐ dā nanare

(||||)
maṁtanānam̐ dānu nenu māḍalāḍugŏnna vĕllā
iṁtaḍilonane ābĕ yĕṭṭĕrim̐gĕne
aṁtaḍivibhum̐ḍu tānĕ ānadiyyam̐ bolum̐gāga
vaṁtulagu nābĕ vachchi vadda nuṁḍĕnā

(||||)
guṭṭunam̐ dānu nenu kūḍugŏnna suddulĕllā
gaṭṭigā vĕlinuṁḍābĕ kanĕnaḍave
suṭṭamuvalĕne tānu sŏppu sūbam̐bolum̐gāga
pŏṭṭabŏrugābĕ vachchi pŏṁdeyappu ḍuṁḍĕnā

(||||)
seri tĕralom̐ danagu sesina sevalĕllā
terage ābĕmadim̐ dĕliyuḍĕṭṭe
merado bhūbadisĕruvu meḍi śhrīveṁkaḍeśhum̐ḍu
yīrīdi nannum̐ gūḍam̐gā nīḍa nālĕ vuṁḍĕnā