Edaleni mamkulu neegela vachchene

ఏడలేని మంకులు నీకేల వచ్చెనే
Language

(॥పల్లవి॥)
ఏడలేని మంకులు నీకేల వచ్చెనే
నీడనుండే చెమరించి నివ్వెరగు లేఁటికే

(॥ఏడ॥)
అప్పటనుండియు నాతఁ డండ నట్టె వుండఁగాను
సెప్పు గాఁగ నీవేల నిందలాడెవే
చొప్పు గాఁగ నీకు నిట్టె చుట్టరికమే చెప్పఁగాఁ
నుప్పతించి వీడె మేల వొల్లననేవే

(॥ఏడ॥)
అంగవించి విభుడు నీయంగములు ముట్టఁగాను
ముంగిట నీచన్ను లేల మూసుకొనేవే
పంగెనగాఁ బ్రియములు పదివేలు చెప్పఁగాను
యెంగిలి నీమోవి యేల యియ్య ననేవే

(॥ఏడ॥)
యెలమి శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడఁగాను
తలవంచుకొని యేల దప్పి గొనేవే
మలసి నీకడ లేనిమన్ననలు యియ్యఁగాను
వెలలేని సంతసాన విఱ్ఱవీఁగేవే

(||pallavi||)
eḍaleni maṁkulu nīgela vachchĕne
nīḍanuṁḍe sĕmariṁchi nivvĕragu lem̐ṭige

(||eḍa||)
appaḍanuṁḍiyu nādam̐ ḍaṁḍa naṭṭĕ vuṁḍam̐gānu
sĕppu gām̐ga nīvela niṁdalāḍĕve
sŏppu gām̐ga nīgu niṭṭĕ suṭṭarigame sĕppam̐gām̐
nuppadiṁchi vīḍĕ mela vŏllananeve

(||eḍa||)
aṁgaviṁchi vibhuḍu nīyaṁgamulu muṭṭam̐gānu
muṁgiḍa nīsannu lela mūsugŏneve
paṁgĕnagām̐ briyamulu padivelu sĕppam̐gānu
yĕṁgili nīmovi yela yiyya naneve

(||eḍa||)
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍam̐gānu
talavaṁchugŏni yela dappi gŏneve
malasi nīgaḍa lenimannanalu yiyyam̐gānu
vĕlaleni saṁtasāna viṭravīm̐geve