Edageda nee baluvu yemtavaamdavu

ఏడకేడ నీ బలువు యెంతవాఁడవు
Language

(॥పల్లవి॥)
ఏడకేడ నీ బలువు యెంతవాఁడవు
యీడనె అన్నియుఁ గంటి మెంతవాఁడవు

(॥ఏడ॥)
కొమ్మ నీకుఁగలిగిన గుణము లడిగితేను
యెమ్మెలెల్లా నాడుకొంటి వెంతవాఁడవు
తమ్మిరేరు(కుఁ?) గన్నులను తరుణి నిన్నుఁ జూచితే
ఇమ్ములను విఱ్ఱవీఁగే వెంతవాఁడవు

(॥ఏడ॥)
అందముగా మేలు మేలని నిన్నుఁ బొగడితే
ఇందరిలో విఱ్ఱవీఁగే వెంతవాఁడవు
పందెగాఁడ వౌదువంటే పంతములు నెరపేవు
యెందుకని నిన్ను మెచ్చే నెంతవాఁడవు

(॥ఏడ॥)
పచ్చిదేరే నిన్నుఁ జూచి పాదాలకు మొక్కితేను
ఇచ్చగించి ఇయ్యకొనే వెంతవాఁడవు
మెచ్చుల శ్రీ వేంకటేశ మించి నన్నుఁ గూడితివి
యెచ్చుకుందులెల్లాఁదేరె నెంతవాఁడవు

(||pallavi||)
eḍageḍa nī baluvu yĕṁtavām̐ḍavu
yīḍanĕ anniyum̐ gaṁṭi mĕṁtavām̐ḍavu

(||eḍa||)
kŏmma nīgum̐galigina guṇamu laḍigidenu
yĕmmĕlĕllā nāḍugŏṁṭi vĕṁtavām̐ḍavu
tammireru(kum̐?) gannulanu taruṇi ninnum̐ jūside
immulanu viṭravīm̐ge vĕṁtavām̐ḍavu

(||eḍa||)
aṁdamugā melu melani ninnum̐ bŏgaḍide
iṁdarilo viṭravīm̐ge vĕṁtavām̐ḍavu
paṁdĕgām̐ḍa vauduvaṁṭe paṁtamulu nĕrabevu
yĕṁdugani ninnu mĕchche nĕṁtavām̐ḍavu

(||eḍa||)
pachchidere ninnum̐ jūsi pādālagu mŏkkidenu
ichchagiṁchi iyyagŏne vĕṁtavām̐ḍavu
mĕchchula śhrī veṁkaḍeśha miṁchi nannum̐ gūḍidivi
yĕchchuguṁdulĕllām̐derĕ nĕṁtavām̐ḍavu