ఎడపులవారము నేమే మెరుఁగుదుము మీ
(॥పల్లవి॥)
ఎడపులవారము నేమే మెరుఁగుదుము మీ-
తడఁబాట్లేమి గల్లా తనువు లెరుఁగును
(॥ఎడ॥)
చెలియ నీరాకలెంచి చెక్కులెల్లాఁ జెమరించి
తలఁపు మీరిమీరి తలవంచె
తెలుసుకో నీవునీవే తెగి విన్నవించలేము
వలపులు వలపులే వడిఁ దారుకాణలు
(॥ఎద॥)
మగువ నిన్నుఁ గూడి మంచముపై వసివాడి
వెగటుగఁ జెలులతో వెంగెమాడె
నగకు నీవంత మాతో నానవు మామనసులు
తగులమిఁ దగులమీఁ దరవు లయ్యీని
(॥ఎడ॥)
యింతి నీవురాఁగా జూచి యెదురెదుర నేలేచి
సంతోసపుఁ బులకల సారెఁ బూచె
యింతలో శ్రీవేంకటేశ యీపె నీవు గూడితివి
మంతనాలూ మంతనాలే మచ్చిక రేఁచీని
(||pallavi||)
ĕḍabulavāramu neme mĕrum̐gudumu mī-
taḍam̐bāṭlemi gallā tanuvu lĕrum̐gunu
(||ĕḍa||)
sĕliya nīrāgalĕṁchi sĕkkulĕllām̐ jĕmariṁchi
talam̐pu mīrimīri talavaṁchĕ
tĕlusugo nīvunīve tĕgi vinnaviṁchalemu
valabulu valabule vaḍim̐ dārugāṇalu
(||ĕda||)
maguva ninnum̐ gūḍi maṁchamubai vasivāḍi
vĕgaḍugam̐ jĕlulado vĕṁgĕmāḍĕ
nagagu nīvaṁta mādo nānavu māmanasulu
tagulamim̐ dagulamīm̐ daravu layyīni
(||ĕḍa||)
yiṁti nīvurām̐gā jūsi yĕdurĕdura nelesi
saṁtosabum̐ bulagala sārĕm̐ būsĕ
yiṁtalo śhrīveṁkaḍeśha yībĕ nīvu gūḍidivi
maṁtanālū maṁtanāle machchiga rem̐sīni