ఏదాయనేమి రొట్టె కింతా రేవేకాదా
(॥పల్లవి॥)
ఏదాయనేమి రొట్టె కింతా రేవేకాదా
దాదాత మోచెఁ బని తానే నేఁగానా
(॥ఏదా॥)
కలికి మాటాడకున్న కంకణాలే మాటలాడీ
మలసి యవే తననూరు గావా
కులికి తాఁ జూడకున్న కుచాలు దలెత్తిచూచీ
అలర నవే తనయంగములుగావా
(॥ఏదా॥)
చిత్తములోఁ దూరకున్న చెవులైన మాఁట దూరీ
మత్తిల్లి యవే తనమారుగాదా
పొత్తుకుఁ బిలువకున్నదోస మొక్కటియయ్యీ
కొత్తగా నదియు నొక్కకూటమే కాదా
(॥ఏదా॥)
కాయములు వేరైతే కాఁగిలి వొక్కటేయయ్యీ
మాయల నేనే తనమారు గాదా
చేయారఁ గూడితి నిట్టె శ్రీవేంకటేశుఁడను
చాయలు సన్నలు నొక్కసరియే కాదా
(||pallavi||)
edāyanemi rŏṭṭĕ kiṁtā revegādā
dādāda mosĕm̐ bani tāne nem̐gānā
(||edā||)
kaligi māḍāḍagunna kaṁkaṇāle māḍalāḍī
malasi yave tananūru gāvā
kuligi tām̐ jūḍagunna kusālu dalĕttisūsī
alara nave tanayaṁgamulugāvā
(||edā||)
sittamulom̐ dūragunna sĕvulaina mām̐ṭa dūrī
mattilli yave tanamārugādā
pŏttugum̐ biluvagunnadosa mŏkkaḍiyayyī
kŏttagā nadiyu nŏkkagūḍame kādā
(||edā||)
kāyamulu veraide kām̐gili vŏkkaḍeyayyī
māyala nene tanamāru gādā
seyāram̐ gūḍidi niṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍanu
sāyalu sannalu nŏkkasariye kādā