Eda suddu leda maadalemdaamkaanu

ఏడ సుద్దు లేడ మాటలెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏడ సుద్దు లేడ మాటలెందాఁకాను
వేడుక పడేవు నీకు వేగిరమేలయ్యా

(॥ఏడ॥)
చెప్పరాని మాటలెల్లాఁ జెప్పుమంటాఁ జెవులొగ్గే-
వప్పటినానలు వెట్టే వందుమీఁద
యిప్పుడు చెలులు నేము నేకతమాడితిమని
విప్పుచూ నెవ్వరు నీకు విన్నవించిరయ్యా

(॥ఏడ॥)
మాలోని ముచ్చటలెల్లా మగుడఁ జెప్పుమనేవు
చేలకొంగు వట్టేవు చెక్కునొక్కేవు
ఆలోచించి గుజగుజలాడుకొంటిమనుచును
పోలించేవు నీవేడ పొంచువింటివయ్యా

(॥ఏడ॥)
మరిగి మేమాడుకొన్న మదనరహస్యములు
వొరసి చెప్పుమనేవు వొడివట్టేవు
గరిమ శ్రీవేంకటేశ కలిసితివిటు నన్ను
యిరవుగా నీవెట్టు యెఱిఁగితివయ్యా

(||pallavi||)
eḍa suddu leḍa māḍalĕṁdām̐kānu
veḍuga paḍevu nīgu vegiramelayyā

(||eḍa||)
sĕpparāni māḍalĕllām̐ jĕppumaṁṭām̐ jĕvulŏgge-
vappaḍinānalu vĕṭṭe vaṁdumīm̐da
yippuḍu sĕlulu nemu negadamāḍidimani
vippusū nĕvvaru nīgu vinnaviṁchirayyā

(||eḍa||)
māloni muchchaḍalĕllā maguḍam̐ jĕppumanevu
selagŏṁgu vaṭṭevu sĕkkunŏkkevu
ālosiṁchi gujagujalāḍugŏṁṭimanusunu
poliṁchevu nīveḍa pŏṁchuviṁṭivayyā

(||eḍa||)
marigi memāḍugŏnna madanarahasyamulu
vŏrasi sĕppumanevu vŏḍivaṭṭevu
garima śhrīveṁkaḍeśha kalisidiviḍu nannu
yiravugā nīvĕṭṭu yĕṟim̐gidivayyā