ఏడ సుద్ది నన్నుఁ జూచి యేల కొంకేవు
(॥పల్లవి॥)
ఏడ సుద్ది నన్నుఁ జూచి యేల కొంకేవు
ఆడా నీడా నిన్నొరయ నంకకత్తెనా
(॥ఏడ॥)
యిచ్చక మాడేదాన యెగ్గులు వట్టేనా
విచ్చన విడుల మీకు వెఱపేఁటికి
చెచ్చెర నింకా నీవు సేసినట్టె సేతుగాక
పచ్చి తిట్టు దిట్ట నీతో పంతగత్తెనా
(॥ఏడ॥)
లోనైవుండినదాన లోఁగి రట్టు సేసేనా
పేనిపట్టి మాఁట మఱపించనేఁటికి
నేనీడనుండఁగానే నీవే మన్నింతువుగాక
ఆనవెట్టి పెనఁగ నే నాసకత్తెనా
(॥ఏడ॥)
గక్కనఁ గూడినదాన కడమ వెట్టేనా
చెక్కు చేతితోడనీకుఁ జింత యేఁటికి
యిక్కడ శ్రీ వేంకటేశ యిరవై వుందువుగాక
పెక్కు బుద్దిచెప్ప నీకుఁ బెల్లి కత్తెనా
(||pallavi||)
eḍa suddi nannum̐ jūsi yela kŏṁkevu
āḍā nīḍā ninnŏraya naṁkagattĕnā
(||eḍa||)
yichchaga māḍedāna yĕggulu vaṭṭenā
vichchana viḍula mīgu vĕṟabem̐ṭigi
sĕchchĕra niṁkā nīvu sesinaṭṭĕ sedugāga
pachchi tiṭṭu diṭṭa nīdo paṁtagattĕnā
(||eḍa||)
lonaivuṁḍinadāna lom̐gi raṭṭu sesenā
penibaṭṭi mām̐ṭa maṟabiṁchanem̐ṭigi
nenīḍanuṁḍam̐gāne nīve manniṁtuvugāga
ānavĕṭṭi pĕnam̐ga ne nāsagattĕnā
(||eḍa||)
gakkanam̐ gūḍinadāna kaḍama vĕṭṭenā
sĕkku sedidoḍanīgum̐ jiṁta yem̐ṭigi
yikkaḍa śhrī veṁkaḍeśha yiravai vuṁduvugāga
pĕkku buddisĕppa nīgum̐ bĕlli kattĕnā