Eda numdi vachchinaamde ibudu daanu

ఏడ నుండి వచ్చినాఁడే ఇపుడు దాను
Language

(॥పల్లవి॥)
ఏడ నుండి వచ్చినాఁడే ఇపుడు దాను
వోడక జాణతనాల కొడిగట్టీఁ గాక

(॥ఏడ॥)
చూడఁజూడఁ జూపులకు సుంకములేలడిగీనే
వేడుకకు వెలగద్దా వేసాలుగాక
వాడికనవ్వులకు వావులేల చెప్పీనే
తోడఁదొడ వలపులు దొంతివెట్టీఁగాక

(॥ఏడ॥)
మేలపుమాటలకు మీరి కొంగేల పట్టినే
యీలకూర కుప్పుగద్దా యెమ్మెలుగాక
పోలిక చక్కఁదనాలు పురుఁడేల పెట్టీనే
తాలిమితో రతులకు దమి రేఁచీఁగాక

(॥ఏడ॥)
నేరుపుల చేఁతలకు నెపమేల వెదకీనే
కోరికకు మితిగద్దా కొత్తలుగాక
యీరీతి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
చేరినన్నుఁగూడి యిట్టె చెలరేఁగీఁగాక

(||pallavi||)
eḍa nuṁḍi vachchinām̐ḍe ibuḍu dānu
voḍaga jāṇadanāla kŏḍigaṭṭīm̐ gāga

(||eḍa||)
sūḍam̐jūḍam̐ jūbulagu suṁkamulelaḍigīne
veḍugagu vĕlagaddā vesālugāga
vāḍiganavvulagu vāvulela sĕppīne
toḍam̐dŏḍa valabulu dŏṁtivĕṭṭīm̐gāga

(||eḍa||)
melabumāḍalagu mīri kŏṁgela paṭṭine
yīlagūra kuppugaddā yĕmmĕlugāga
poliga sakkam̐danālu purum̐ḍela pĕṭṭīne
tālimido radulagu dami rem̐sīm̐gāga

(||eḍa||)
nerubula sem̐talagu nĕbamela vĕdagīne
korigagu midigaddā kŏttalugāga
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
serinannum̐gūḍi yiṭṭĕ sĕlarem̐gīm̐gāga