ఏడ నుండెనో తాను యిన్నాళ్ల దాఁకా
(॥పల్లవి॥)
ఏడ నుండెనో తాను యిన్నాళ్ల దాఁకా
యీడు జోడయిన సుద్దు లీతని నడుగరే
(॥ఏడ॥)
పూసగుచ్చినటువలె పొలఁతి మాఁటలాడీని
వేసర దెంతైనాను విభునితోను
రాసివోసినటువలె రవళితో నవ్వు నవ్వీ
యీసుదతి యెవ్వతెని యీతని నడుగవే(రే?)
(॥ఏడ॥)
వడ్డి కిచ్చినటువలె వచ్చి వచ్చి కొసరీని
వొడ్డారాలు నెరపుతా నూరకె తాను
దిడ్డి దీసినటువలె తేరకొనఁ జూచీని
యెడ్డ యిది యెవ్వతెని యీతని నడుగరే
(॥ఏడ॥)
గంపఁ గమ్మినటువలె కాఁగిట బిగించీని
చెంపల చెమటలతో సిగ్గువడదు
దింపక నన్నేలినాఁ డిదివో శ్రీవేంకటేశుఁడు
యింపుల నీబెవ్వతెని యీతని నడుగరే
(||pallavi||)
eḍa nuṁḍĕno tānu yinnāḽla dām̐kā
yīḍu joḍayina suddu līdani naḍugare
(||eḍa||)
pūsaguchchinaḍuvalĕ pŏlam̐ti mām̐ṭalāḍīni
vesara dĕṁtainānu vibhunidonu
rāsivosinaḍuvalĕ ravaḽido navvu navvī
yīsudadi yĕvvadĕni yīdani naḍugave(re?)
(||eḍa||)
vaḍḍi kichchinaḍuvalĕ vachchi vachchi kŏsarīni
vŏḍḍārālu nĕrabudā nūragĕ tānu
diḍḍi dīsinaḍuvalĕ teragŏnam̐ jūsīni
yĕḍḍa yidi yĕvvadĕni yīdani naḍugare
(||eḍa||)
gaṁpam̐ gamminaḍuvalĕ kām̐giḍa bigiṁchīni
sĕṁpala sĕmaḍalado sigguvaḍadu
diṁpaga nannelinām̐ ḍidivo śhrīveṁkaḍeśhum̐ḍu
yiṁpula nībĕvvadĕni yīdani naḍugare