ఏడ నేరుచుకొంటివి యిటువంటి కొత్తలు
(॥పల్లవి॥)
ఏడ నేరుచుకొంటివి యిటువంటి కొత్తలు
వేడుకలివెల్లా నీకు వెల్లావిరులాయనా
(॥॥)
సమ్మతించఁ జెప్పి నాచంటిపై గోరుదీసేవు
వుమ్మడి నేమి సేసినా నొద్దంటినా
యెమ్మెల నెవ్వతై నాను యిటువలెనే నీకు
చిమ్ముచుఁ జేసే సేఁతలు చెప్పిచెప్పి చేసునా
(॥॥)
గడ్డమువట్టి వేఁడుక గంటి సేసేవు మోవి
వొడ్డి వూరకే సేయఁగా నొద్దంటినా
వొడ్డారానా నెవ్వతైనా నొద్దనుండి నీ కిట్ల
జిడ్డుదేర ననుపులు చెప్పి చెప్పి చేసునా
(॥॥)
యెలమి శ్రీవేంకటేశ యెవ్వతైనా నా నీకిట్ల
చెలరేఁగిని పెండ్లిండ్లు చెప్పిచెప్పి చేసునా
కలసి కాఁగిటఁ గూడి కంకణము గట్టేవు
వొలసి ముందే కట్టఁగా నొద్దంటినా
(||pallavi||)
eḍa nerusugŏṁṭivi yiḍuvaṁṭi kŏttalu
veḍugalivĕllā nīgu vĕllāvirulāyanā
(||||)
sammadiṁcham̐ jĕppi nāsaṁṭibai gorudīsevu
vummaḍi nemi sesinā nŏddaṁṭinā
yĕmmĕla nĕvvadai nānu yiḍuvalĕne nīgu
simmusum̐ jese sem̐talu sĕppisĕppi sesunā
(||||)
gaḍḍamuvaṭṭi vem̐ḍuga gaṁṭi sesevu movi
vŏḍḍi vūrage seyam̐gā nŏddaṁṭinā
vŏḍḍārānā nĕvvadainā nŏddanuṁḍi nī kiṭla
jiḍḍudera nanubulu sĕppi sĕppi sesunā
(||||)
yĕlami śhrīveṁkaḍeśha yĕvvadainā nā nīgiṭla
sĕlarem̐gini pĕṁḍliṁḍlu sĕppisĕppi sesunā
kalasi kām̐giḍam̐ gūḍi kaṁkaṇamu gaṭṭevu
vŏlasi muṁde kaṭṭam̐gā nŏddaṁṭinā