Eda nerusugomtive yimtesi dittadanaalu

ఏడ నేరుచుకొంటివే యింతేసి దిట్టతనాలు
Language

(॥పల్లవి॥)
ఏడ నేరుచుకొంటివే యింతేసి దిట్టతనాలు
మేడెము గూడి చెలులు మెచ్చేరు నిన్నును

(॥ఏడ॥)
ముసి ముసి నవ్వులతో ముద్దు లేమి గురిసేవే
కొసరి విభునినిన్నుఁ గొలువులోన
కసుఁగాటు వలపుల కతకారి వవుదువే
వెస నిన్నుఁ జూచి చూచి వెరగయ్యీ నాకు

(॥ఏడ॥)
చెక్కిటి చేతితోడ సిగ్గు లేమి నెరపేవే
మొక్కలాన రమణుని మొగమెదుట
వెక్కసపుఁ జేఁతల వేడుకకత్తె వవుదువే
చొక్కుచు నీసుద్దులకు సోద్యమయ్యీ నాకు

(॥ఏడ॥)
సరికి బేసికి నుండి జాణతనా లేమాడేవే
పరగ శ్రీ వేంకటేశుపానుపు మీఁద
యిరవై నన్నితఁడేలె యిచ్చకురాల వవుదువే
తొరలి నీ బుద్దికి సంతోసమయ్యీ నాకు

(||pallavi||)
eḍa nerusugŏṁṭive yiṁtesi diṭṭadanālu
meḍĕmu gūḍi sĕlulu mĕchcheru ninnunu

(||eḍa||)
musi musi navvulado muddu lemi guriseve
kŏsari vibhunininnum̐ gŏluvulona
kasum̐gāḍu valabula kadagāri vavuduve
vĕsa ninnum̐ jūsi sūsi vĕragayyī nāgu

(||eḍa||)
sĕkkiḍi sedidoḍa siggu lemi nĕrabeve
mŏkkalāna ramaṇuni mŏgamĕduḍa
vĕkkasabum̐ jem̐tala veḍugagattĕ vavuduve
sŏkkusu nīsuddulagu sodyamayyī nāgu

(||eḍa||)
sarigi besigi nuṁḍi jāṇadanā lemāḍeve
paraga śhrī veṁkaḍeśhubānubu mīm̐da
yiravai nannidam̐ḍelĕ yichchagurāla vavuduve
tŏrali nī buddigi saṁtosamayyī nāgu