ఏడ నేరుచుకొంటిరే యివెల్లా మీరు
(॥పల్లవి॥)
ఏడ నేరుచుకొంటిరే యివెల్లా మీరు
వాడికలు నెరపేరు వంతులకు మీరు
(॥ఏడ॥)
మచ్చిక నాతఁడు నేనూ మాటలాడఁగానే మీరు
యిచ్చటఁ బతికి మాట లేమి చెప్పిరే
కచ్చుపెట్టి నావంటి కాంతలఁ దెచ్చె రటరే
ఇచ్చకములు సేసేరు ఇటు నటు మీరు
(॥ఏడ॥)
తతి నిద్దరము నేకతాన నుండఁగానే మీరు
యితనికి సన్నలు మీరేమి సేసేరే
యితవుగా నావలెనే ఇంపులు చూపేరటరే
కతకారితనములు గరుపేరు మీరు
(॥ఏడ॥)
శ్రీవేంకటేశుఁడు నేనుఁ జేరి కూడఁగానే మీరు
యీవల నేమి కానుక లిపు డిచ్చేరే
చేవదేరఁ జేసేసేవ సేయించే రటరే
వావు లెవ్వరివో చెప్పివచ్చేరు మీరు
(||pallavi||)
eḍa nerusugŏṁṭire yivĕllā mīru
vāḍigalu nĕraberu vaṁtulagu mīru
(||eḍa||)
machchiga nādam̐ḍu nenū māḍalāḍam̐gāne mīru
yichchaḍam̐ badigi māḍa lemi sĕppire
kachchubĕṭṭi nāvaṁṭi kāṁtalam̐ dĕchchĕ raḍare
ichchagamulu seseru iḍu naḍu mīru
(||eḍa||)
tadi niddaramu negadāna nuṁḍam̐gāne mīru
yidanigi sannalu mīremi sesere
yidavugā nāvalĕne iṁpulu sūberaḍare
kadagāridanamulu garuberu mīru
(||eḍa||)
śhrīveṁkaḍeśhum̐ḍu nenum̐ jeri kūḍam̐gāne mīru
yīvala nemi kānuga libu ḍichchere
sevaderam̐ jeseseva seyiṁche raḍare
vāvu lĕvvarivo sĕppivachcheru mīru