Eda maadaadimcha nela yemmelam benamganela

ఎడ మాటాడించ నేల యెమ్మెలఁ బెనఁగనేల
Language

(॥పల్లవి॥)
ఎడ మాటాడించ నేల యెమ్మెలఁ బెనఁగనేల
వొడఁబడవలెఁగాక వొక్కటైనవారికి

(॥ఎడ॥)
వలపులు మొదలనే వా(వ్రా)సివున్నవి నుదుళ్ల
చలపాదితనమేల సరసులకు
మొలచినతరితీపు మోవితేనెల నున్నది
యెలయింపు లిఁకనేల యెనసినవారికి

(॥ఎడ॥)
తనివోనికోరికలు దాఁచివున్నవి మతుల
కినియనేఁటికి నెఱిఁగినవారికి
నినుపులై పాయములు నిండివున్నవి మేనుల
అనుమానించఁగనేల ఆపగలవారికి

(॥ఎడ॥)
పరగినరతులెల్లా పాఁతివున్నవి కాఁగిళ్ల
నెరసులు మరియేల నేర్పరులకు
గరిమ శ్రీవేంకటేశ కలసితి రిద్దరును
పొరపొచ్చా లిఁకనేల పొఁ(ప్రొం)దైనవారిక

(||pallavi||)
ĕḍa māḍāḍiṁcha nela yĕmmĕlam̐ bĕnam̐ganela
vŏḍam̐baḍavalĕm̐gāga vŏkkaḍainavārigi

(||ĕḍa||)
valabulu mŏdalane vā(vrā)sivunnavi nuduḽla
salabādidanamela sarasulagu
mŏlasinadaridību movidenĕla nunnadi
yĕlayiṁpu lim̐kanela yĕnasinavārigi

(||ĕḍa||)
tanivonigorigalu dām̐sivunnavi madula
kiniyanem̐ṭigi nĕṟim̐ginavārigi
ninubulai pāyamulu niṁḍivunnavi menula
anumāniṁcham̐ganela ābagalavārigi

(||ĕḍa||)
paraginaradulĕllā pām̐tivunnavi kām̐giḽla
nĕrasulu mariyela nerbarulagu
garima śhrīveṁkaḍeśha kalasidi riddarunu
pŏrabŏchchā lim̐kanela pŏm̐(prŏṁ)dainavāriga