Eda gollagattevu ninnemi seppedi

ఎడ గొల్లకత్తెవు నిన్నేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎడ గొల్లకత్తెవు నిన్నేమి చెప్పేది
అడియాలాలెల్లాఁ జూపే వౌదువే నేర్పరివి

(॥ఎడ॥)
సందడిఁ బెండ్లాడనాపె నరసము లాడఁగాను
కందువ నుండినయాపె కాచుకుండఁగా
యెందుండో వచ్చి నీవు యీతఁడు నామగఁడంటా
అందరిలోఁ గొంగువట్టే వౌదువే నేర్పరివి

(॥ఎడ॥)
యెదురువెట్టినయాపె ఇంటికిఁ బిలువఁగాను
మొదట వచ్చినయాపె ముంచి నవ్వఁగా
పొదిగి నీ కితఁడు పొందనాలు గూడెనంటా
అదనఁ గాఁగిలించేవు అవుదువే నేర్పరివి

(॥ఎడ॥)
పిలిచి తెచ్చినమాపె ప్రియపడి వుండఁగాను
కలసి నాపెను నేనే కలిగుండఁగా
యెలమి శ్రీవేంకటేశుఁ డతఁడు నాపొరుగంటా
అలరి చెనకఁజూచే వౌదువే నేర్పరివి

(||pallavi||)
ĕḍa gŏllagattĕvu ninnemi sĕppedi
aḍiyālālĕllām̐ jūbe vauduve nerbarivi

(||ĕḍa||)
saṁdaḍim̐ bĕṁḍlāḍanābĕ narasamu lāḍam̐gānu
kaṁduva nuṁḍinayābĕ kāsuguṁḍam̐gā
yĕṁduṁḍo vachchi nīvu yīdam̐ḍu nāmagam̐ḍaṁṭā
aṁdarilom̐ gŏṁguvaṭṭe vauduve nerbarivi

(||ĕḍa||)
yĕduruvĕṭṭinayābĕ iṁṭigim̐ biluvam̐gānu
mŏdaḍa vachchinayābĕ muṁchi navvam̐gā
pŏdigi nī kidam̐ḍu pŏṁdanālu gūḍĕnaṁṭā
adanam̐ gām̐giliṁchevu avuduve nerbarivi

(||ĕḍa||)
pilisi tĕchchinamābĕ priyabaḍi vuṁḍam̐gānu
kalasi nābĕnu nene kaliguṁḍam̐gā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu nābŏrugaṁṭā
alari sĕnagam̐jūse vauduve nerbarivi