Eda gollagatte yeebe yevvadoyi

ఎడ గొల్లకత్తె యీపె యెవ్వతోయి
Language

(॥పల్లవి॥)
ఎడ గొల్లకత్తె యీపె యెవ్వతోయి
అడియలా లెత్తీ నాతో నానతీవోయి

(॥ఎడ॥)
వాలికచూపుల నిన్ను వంచివంచి చూచీని
అలా నీకు తానేమైనా నదేమి యీపె
మేలమాడీ నప్పటిని మేకులు నీతోఁ జేసీ
వోలి వెట్టించుక నిన్ను నొద్దికఁ బెండ్లాడెనా

(॥ఎడ॥)
పువ్వులు వేసి నిన్ను బొమ్మల జంకించీని
దేవులా తా నేమైనా తెగడీ నీపె
వావులు నీతోఁ జెప్పి వట్టిరసాలాడీ
కావించి నీకుఁగాను కంకణము గట్టెనా

(॥ఎడ॥)
నంటున సంగడి నిన్ను నడుమఁగా గాఁగిట నించీ
యింటి యాపే తాను నీకు నేమైనా నీపె
జంట న న్నేలితివి సరుగ శ్రీవేంకటేశ
దంటా తా నేమి తొల్లి తలఁబాలు వోసెనా

(||pallavi||)
ĕḍa gŏllagattĕ yībĕ yĕvvadoyi
aḍiyalā lĕttī nādo nānadīvoyi

(||ĕḍa||)
vāligasūbula ninnu vaṁchivaṁchi sūsīni
alā nīgu tānemainā nademi yībĕ
melamāḍī nappaḍini megulu nīdom̐ jesī
voli vĕṭṭiṁchuga ninnu nŏddigam̐ bĕṁḍlāḍĕnā

(||ĕḍa||)
puvvulu vesi ninnu bŏmmala jaṁkiṁchīni
devulā tā nemainā tĕgaḍī nībĕ
vāvulu nīdom̐ jĕppi vaṭṭirasālāḍī
kāviṁchi nīgum̐gānu kaṁkaṇamu gaṭṭĕnā

(||ĕḍa||)
naṁṭuna saṁgaḍi ninnu naḍumam̐gā gām̐giḍa niṁchī
yiṁṭi yābe tānu nīgu nemainā nībĕ
jaṁṭa na nnelidivi saruga śhrīveṁkaḍeśha
daṁṭā tā nemi tŏlli talam̐bālu vosĕnā