Eda daamsugumdeno yivimdaamkaanu

ఏడ దాఁచుకుండెనో యివిందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏడ దాఁచుకుండెనో యివిందాఁకాను
వాడు దేరె నీవు తనవద్ద నుండఁగాను

(॥ఏడ॥)
సెలవినవ్వులు గారె చెక్కులఁ గళలు దేరె
మలసి చెలితో నీవు మాటలాడఁగా
కలువకన్నులు విచ్చె కతలు చెప్పఁగఁ జొచ్చె
పొలసి పొలసి నీవు బుజ్జగించఁగాను

(॥ఏడ॥)
పొంచినయాసలు రేఁగె పులకలు విఱ్ఱవీఁగె
మంచముపై నుండి నీవు మన సియ్యఁగా
ముంచి పైపైఁ జెమరించె మోహము నీ కొప్పగించె
అంచెల మర్మముల నేఁడట్టె నీ వంటఁగాను

(॥ఏడ॥)
కమ్మరఁ జేతుల మొక్కె కాఁగిట నీకుఁ జొక్కె
వుమ్మగిలురతులు నీ వొసఁగఁగాను
యిమ్ముల శ్రీవెంకటేశ యిన్నిటాను నిన్నుఁ గూడె
సమ్మతించి నీ విట్టె చన వియ్యఁగాను

(||pallavi||)
eḍa dām̐suguṁḍĕno yiviṁdām̐kānu
vāḍu derĕ nīvu tanavadda nuṁḍam̐gānu

(||eḍa||)
sĕlavinavvulu gārĕ sĕkkulam̐ gaḽalu derĕ
malasi sĕlido nīvu māḍalāḍam̐gā
kaluvagannulu vichchĕ kadalu sĕppam̐gam̐ jŏchchĕ
pŏlasi pŏlasi nīvu bujjagiṁcham̐gānu

(||eḍa||)
pŏṁchinayāsalu rem̐gĕ pulagalu viṭravīm̐gĕ
maṁchamubai nuṁḍi nīvu mana siyyam̐gā
muṁchi paibaim̐ jĕmariṁchĕ mohamu nī kŏppagiṁchĕ
aṁchĕla marmamula nem̐ḍaṭṭĕ nī vaṁṭam̐gānu

(||eḍa||)
kammaram̐ jedula mŏkkĕ kām̐giḍa nīgum̐ jŏkkĕ
vummagiluradulu nī vŏsam̐gam̐gānu
yimmula śhrīvĕṁkaḍeśha yinniḍānu ninnum̐ gūḍĕ
sammadiṁchi nī viṭṭĕ sana viyyam̐gānu