ఎచ్చుకుందు లాడకురే యేమీననకురే
(॥పల్లవి॥)
ఎచ్చుకుందు లాడకురే యేమీననకురే
కచ్చుపెట్టి యాతనికిఁ గడు నే వలతును
(॥॥)
చేసినంతఁ జేయనీరే చెప్పకురే యాసుద్ది
ఆసయిచ్చాతఁడొక మాటాడితేఁ జాలు
వాసికిఁబెనఁగఁబోతే వడిఁబడుఁ జేసునిఁక
నాసరివారెల్లాఁ జూడ నవ్వినంతే చాలును
(॥॥)
కూడినట్టె కూడనీరే కోపించకురే యాతని-
నీడ కాతడు విచ్చేసే యెమ్మెలే చాలు
పాడి పంతా లాడబోతే పదను దప్పునో యేమో
మేడెపు సరస వేళ మెచ్చినంతే చాలును
(॥॥)
వుండినట్టె వుండనీరే వొరయకురే యాతని-
నండఁ దా నిక్కి చూచిన నదియే చాలు
నిండా శ్రీవేంకటాద్రి నిలయుఁడు నన్నుఁ గూడె
కొండుక మేనఁజేసిన గురుతే చాలును
(||pallavi||)
ĕchchuguṁdu lāḍagure yemīnanagure
kachchubĕṭṭi yādanigim̐ gaḍu ne valadunu
(||||)
sesinaṁtam̐ jeyanīre sĕppagure yāsuddi
āsayichchādam̐ḍŏga māḍāḍidem̐ jālu
vāsigim̐bĕnam̐gam̐bode vaḍim̐baḍum̐ jesunim̐ka
nāsarivārĕllām̐ jūḍa navvinaṁte sālunu
(||||)
kūḍinaṭṭĕ kūḍanīre kobiṁchagure yādani-
nīḍa kādaḍu vichchese yĕmmĕle sālu
pāḍi paṁtā lāḍabode padanu dappuno yemo
meḍĕbu sarasa veḽa mĕchchinaṁte sālunu
(||||)
vuṁḍinaṭṭĕ vuṁḍanīre vŏrayagure yādani-
naṁḍam̐ dā nikki sūsina nadiye sālu
niṁḍā śhrīveṁkaḍādri nilayum̐ḍu nannum̐ gūḍĕ
kŏṁḍuga menam̐jesina gurude sālunu