Echchodi kemgina yeppudoom damaloni

ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని
Language

(॥పల్లవి॥)
ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని -
మచ్చిక పెనుఁదెవులు మానకపోయె

(॥ఎచ్చో॥)
పాయపు సతులగుబ్బల పెదపొట్లాల
కాయము వడి నొత్తి కాఁచఁగను
రాయిడిచే ఘనమాయఁగాని లోని-
మాయపు పెనుఁదెవులు మానకపోయె

(॥ఎచ్చో॥)
అతివల మోహపుటధరామృతములు
యితవుగ నోరి కందియ్యఁగను
అదిమోహమే ఘనమాయఁగాని లోని-
మతకరిపెనుఁదెవులు మానకపొయె

(॥ఎచ్చో॥)
తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద-
నిరవుగ నిటు సుఖియించఁగను
తిరువేంకటాచలాధీశుకృపచేఁగాని
మరుచేతి పెనుఁదెవులు మానకపోయె

(||pallavi||)
ĕchchoḍi kem̐gina yĕppuḍūm̐ damaloni -
machchiga pĕnum̐dĕvulu mānagaboyĕ

(||ĕchcho||)
pāyabu sadulagubbala pĕdabŏṭlāla
kāyamu vaḍi nŏtti kām̐sam̐ganu
rāyiḍise ghanamāyam̐gāni loni-
māyabu pĕnum̐dĕvulu mānagaboyĕ

(||ĕchcho||)
adivala mohabuḍadharāmṛtamulu
yidavuga nori kaṁdiyyam̐ganu
adimohame ghanamāyam̐gāni loni-
madagaribĕnum̐dĕvulu mānagabŏyĕ

(||ĕchcho||)
taruṇula menimĕttanibarabulamīm̐da-
niravuga niḍu sukhiyiṁcham̐ganu
tiruveṁkaḍāsalādhīśhukṛpasem̐gāni
marusedi pĕnum̐dĕvulu mānagaboyĕ