Ebuna nemta veṟadu veeyimtigi

ఏపున నెంత వెఱతు వీయింతికి
Language

(॥పల్లవి॥)
ఏపున నెంత వెఱతు వీయింతికి
ఆపె మాట మీరనని ఆనవెట్టుకొంటివో

(॥ఏప॥)
వేగినంతా నే నీకు విన్నపాలు చేసినవి
ఆగడాలు చేసితివి ఆపెతోడను
చేగలెక్క నీపై నేను సేసవిరులు వెట్టితే
పోగులుగా ఆకెదుటఁ బోసితివి

(॥ఏప॥)
యేకతానఁ గస్తూరి నీకితవుగాఁ బూసినది
ఆకెకుఁ జూపితివి నీవంతలోననే
దాకొని నీచెవినిండాఁ దట్టుపునుఁగు వెట్టితే
కైకొని యాపెకు నెట్టు కానుకిచ్చితివి

(॥ఏప॥)
చనుదోయి కాఁగిట లచ్చనగా నీకు నించితే
పెనఁగకు మనుచు నాపెకుఁ జూపేవు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విద్దరిని
చనుమానాలిచ్చి మమ్ము సరిగాఁ బెంచేవు

(||pallavi||)
ebuna nĕṁta vĕṟadu vīyiṁtigi
ābĕ māḍa mīranani ānavĕṭṭugŏṁṭivo

(||eba||)
veginaṁtā ne nīgu vinnabālu sesinavi
āgaḍālu sesidivi ābĕdoḍanu
segalĕkka nībai nenu sesavirulu vĕṭṭide
pogulugā āgĕduḍam̐ bosidivi

(||eba||)
yegadānam̐ gastūri nīgidavugām̐ būsinadi
āgĕgum̐ jūbidivi nīvaṁtalonane
dāgŏni nīsĕviniṁḍām̐ daṭṭubunum̐gu vĕṭṭide
kaigŏni yābĕgu nĕṭṭu kānugichchidivi

(||eba||)
sanudoyi kām̐giḍa lachchanagā nīgu niṁchide
pĕnam̐gagu manusu nābĕgum̐ jūbevu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viddarini
sanumānālichchi mammu sarigām̐ bĕṁchevu