Ebulunu raampulunu yemdaamkane

ఏపులును రాఁపులును యెందాఁకనే
Language

(॥పల్లవి॥)
ఏపులును రాఁపులును యెందాఁకనే
చాపకింది వెల్లువాయఁ జాలదా సరసము

(॥ఏప॥)
యెడమాట లాడేది యెందాఁకనే
అడియాసలఁ బెట్టే దదెందాఁకనే
కడకుఁ దొలఁగరాదు గక్కనఁ బైకొనరాదు
జడిసీ జిత్తము నాతో చాలదా సరసము

(॥ఏప॥)
యెలయింపుఁ గొసరులు యెందాఁకనే
అలిగి కోపము నాతో అదెందాఁకనే
వలపు చల్లగరాదు వడి మూటఁగట్టగరాదు
చలములు పతి నాతో చాలదా సరసము

(॥ఏప॥)
యేడలేని వినయాలు యెందాఁకనే
ఆడుకోలు నిజబాస లవెందాఁకనే
కూడెను శ్రీవేంకటాద్రి గోవిందుఁ డిదె నన్ను
జాడలెల్లాఁ గంటి మిఁకఁ జాలదా సరసము

(||pallavi||)
ebulunu rām̐pulunu yĕṁdām̐kane
sābagiṁdi vĕlluvāyam̐ jāladā sarasamu

(||eba||)
yĕḍamāḍa lāḍedi yĕṁdām̐kane
aḍiyāsalam̐ bĕṭṭe dadĕṁdām̐kane
kaḍagum̐ dŏlam̐garādu gakkanam̐ baigŏnarādu
jaḍisī jittamu nādo sāladā sarasamu

(||eba||)
yĕlayiṁpum̐ gŏsarulu yĕṁdām̐kane
aligi kobamu nādo adĕṁdām̐kane
valabu sallagarādu vaḍi mūḍam̐gaṭṭagarādu
salamulu padi nādo sāladā sarasamu

(||eba||)
yeḍaleni vinayālu yĕṁdām̐kane
āḍugolu nijabāsa lavĕṁdām̐kane
kūḍĕnu śhrīveṁkaḍādri goviṁdum̐ ḍidĕ nannu
jāḍalĕllām̐ gaṁṭi mim̐kam̐ jāladā sarasamu