ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ
(॥పల్లవి॥)
ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ
వీఁపు గానరాఁగా దాఁగే విద్య నీది గాక
(॥ఏపొ॥)
పుట్టిన మెకానకుఁ బూరి మేయ నేరిపిరా
అట్టె పిల్లలఁ బెట్ట నటు నేర్పిరా
చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా
మట్టులేని దింతా నీమాయ యింతేకాక
(॥ఏపొ॥)
తీవెలకుఁ జుట్టి చుట్టి దిక్కులఁ బాఁక నేరిపిరా
తావులఁ దతికాలానఁ బూవ నేరిపిరా
వేవేలు పక్కొమ్మలు వెసఁ బెట్ట నేరిపిరా
యేవలఁ జూచినా నీమహిమ లింతేగాక
(॥ఏపొ॥)
కోరి పక్షులు కొరులు గూండ్లువెట్ట నేరిపిరా
సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా
యీరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన
చేరి నీవు సేసిన సృష్టి యింతే కాక
(||pallavi||)
ebŏddū nīsem̐talĕllā yĕduḍane kānavachchī
vīm̐pu gānarām̐gā dām̐ge vidya nīdi gāga
(||ebŏ||)
puṭṭina mĕgānagum̐ būri meya neribirā
aṭṭĕ pillalam̐ bĕṭṭa naḍu nerbirā
suṭṭi nīḽlunnasoḍu sodiṁcha neribirā
maṭṭuleni diṁtā nīmāya yiṁtegāga
(||ebŏ||)
tīvĕlagum̐ juṭṭi suṭṭi dikkulam̐ bām̐ka neribirā
tāvulam̐ dadigālānam̐ būva neribirā
vevelu pakkŏmmalu vĕsam̐ bĕṭṭa neribirā
yevalam̐ jūsinā nīmahima liṁtegāga
(||ebŏ||)
kori pakṣhulu kŏrulu gūṁḍluvĕṭṭa neribirā
sārĕ jādiyyāhārālasavi nerbirā
yīrīdi śhrīveṁkaḍeśha yinniyu logamulona
seri nīvu sesina sṛṣhṭi yiṁte kāga